తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో సచిన్​ తనయుడు- ముంబయి తరఫున బరిలోకి - ఐపీఎల్​ అర్జున్​ తెందుల్కర్​

భారత క్రికెట్​ దిగ్జజం సచిన్​ తెందుల్కర్​ తనయుడు అర్జున్​ తెందుల్కర్​ను ఐపీఎల్​ వేలంలో ముంబయి ఇండియన్స్​ సొంతం చేసుకుంది. రూ.20 లక్షల కనీస ధరకే కొనుక్కుంది. ఫలితంగా ఈ సీజన్​తోనే అతడు ఈ మెగాలీగ్​ అరంగేట్రం చేయనున్నాడు.

ipl
ఐపీఎల్​

By

Published : Feb 18, 2021, 9:34 PM IST

భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్‌ తెందుల్కర్‌ కుమారుడు అర్జున్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్(ఐపీఎల్​)‌ 2021లో సందడి చేయనున్నాడు. తొలిసారి వేలంలో పేరు నమోదు చేసుకున్న అతడిని ముంబయి ఇండియన్స్‌ రూ.20 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. అతడి కోసం మరే ఇతర ఫ్రాంఛైజీ ఆసక్తి కనబరచలేదు. గతంలో అర్జున్‌ ఐపీఎల్‌ వేలంలో పేరు నమోదు చేసుకోలేదు. ఈ ఏడాది ముంబయి తరఫున సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఒక మ్యాచ్‌ ఆడటం వల్ల వేలానికి అర్హత లభించింది.

వేలంలో అర్జున్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని భావించినా అలాంటిదేమీ జరగలేదు. అయితే ఆఖరి పేరు మాత్రం అతడిదే కావడం గమనార్హం. ఎడమచేతి వాటం పేస్‌ బౌలర్‌ అయిన అర్జున్‌.. వికెట్లు తీయడమే కాకుండా భారీ సిక్సర్లూ బాదగలడు. గతంలో టీమ్‌ఇండియా మహిళల జట్టు, ఇతర జట్లకు అతడు నెట్స్‌లో బౌలింగ్‌ చేశాడు.

ఇదీ చూడండి: ఐపీఎల్​ ముందు సచిన్​ తనయుడికి ఎదురుదెబ్బ

ABOUT THE AUTHOR

...view details