తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో సాఫ్ట్ సిగ్నల్​ను తీసేసిన బీసీసీఐ - క్రికెట్ న్యూస్

త్వరలో జరగబోయే ఐపీఎల్​లో సాఫ్ట్ సిగ్నల్​ వినియోగాన్ని తొలగించింది భారత్ క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది.

BCCI removes 'soft signal' from IPL 14
ఐపీఎల్​లో సాఫ్ట్ సిగ్నల్​కు నో ఛాన్స్: బీసీసీఐ

By

Published : Mar 28, 2021, 9:37 AM IST

వచ్చే ఐపీఎల్​లో సాఫ్ట్ సిగ్నల్ లేదు. మైదానం అంపైర్ మూడో అంపైర్​కు నిర్ణయాధికారాన్ని ఇచ్చేటప్పుడు ఇచ్చే ఈ సిగ్నల్​ను 2021 ఐపీఎల్​లో అనుమతించరాదని బీసీసీఐ నిర్ణయించింది. మైదానం అంపైర్ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మూడో అంపైర్ అత్యుత్తమ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా సాఫ్ట్ సిగ్నల్​ను తొలగించారు.

ఇంగ్లాండ్​తో నాలుగో టీ20 సందర్భంగా సూర్యకుమార్​ యాదవ్ క్యాచ్​ను ఇంగ్లాండ్ ఫీల్డర్ మలన్ సరిగా అందుకున్నాడా లేదా అన్న స్పష్టత లేకపోయినా.. మైదానం అంపైర్ ఔటని సాఫ్ట్ సిగ్నల్​ ఇవ్వడం వల్ల మూడో అంపైర్ సూర్యను ఔటని ప్రకటించాడు. దీంతో విరాట్ ఈ సాఫ్ట్ సిగ్నల్​ పద్ధతిని వ్యతిరేకించాడు.

కోహ్లీ ఐపీఎల్

ABOUT THE AUTHOR

...view details