తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐపీఎల్​కు​ కరోనా బీమా వర్తించదు' - ipl corona insurance

ఐపీఎల్​కు కరోనా బీమా వర్తించదని స్పష్టం చేశారు ఓ ప్రముఖ బీమా సంస్థకు చెందిన అధికారి. ప్రపంచ క్రీడా రంగంలో కేవలం ఒలింపిక్స్, వింబుల్డన్​కు మాత్రమే ఈ తరహా రక్షణ పాలసీ ఉందని తెలిపారు.

IPL
ఐపీఎల్

By

Published : Sep 15, 2020, 4:49 PM IST

కరోనా వల్ల క్రీడా రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు కొవిడ్‌ బీమా కల్పించాలని బీసీసీఐ, ఫ్రాంచైజీలు, ప్రసారకర్త స్టార్‌ ఇండియా భావించాయి. కానీ ప్రస్తుత తరుణంలో మ్యాచులు జరిగిటేప్పుడు ఆటగాడికి కరోనా సోకి అవి రద్దు అయితే బీమా కల్పించడం కుదరదని.. సంబంధిత కంపెనీలు స్పష్టం చేశాయి.

ప్రపంచ క్రీడా రంగంలో.. మహమ్మారి‌ తరహా బీమా ఒలింపిక్స్, వింబుల్డన్‌కు మాత్రమే ఉంది. అదికూడా 2003లో సార్స్‌ ప్రబలినప్పటి నుంచి ఆల్‌ ఇంగ్డాండ్‌ క్లబ్‌ నిర్వాహకులు ఏటా ఈ తరహా పాలసీ తీసుకుంటున్నారు. కాగా, కరోనాతో 2020 వింబుల్డన్‌ రద్దుకాగా.. నిర్వాహకులకు వెయ్యి కోట్లకు పైగా బీమాగా లభించింది. ముందుగా ఉన్న బీమా ఒప్పందాల కారణంగా ఈ పాలసీ వర్తించింది.

అయితే, దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్‌కు బీసీసీఐ, ఫ్రాంచైజీలు రెండు పెద్ద బీమా పాలసీలు తీసుకున్నాయి. టోర్నీ రద్దుకు సంబంధించి బీసీసీఐ చేసిన బీమా మొదటిది. రెండో దానిని ఆటగాళ్లు రెమ్యునరేషన్‌ నష్టపోతే చెల్లించే పాలసీని ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. అయితే ఈ రెండు పాలసీలు కరోనా కిందకు రావని ప్రముఖ బీమా సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి 'సచిన్ కొత్త స్నేహితుడు మళ్లీ వచ్చాడు.. కానీ'

ABOUT THE AUTHOR

...view details