తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​కు కరోనా ముప్పు తప్పదా? - ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​)కు కరోనా ఎఫెక్ట్ తప్పదా

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ప్రభావం... ఐపీఎల్​కు ఆటంకంగా మారుతుందా? ఇప్పటికే భారత్​లోనూ కేసులు సంఖ్య పెరుగుతున్న సందర్భంగా, ఈ టోర్నీ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్​ ఛైర్మన్​ బ్రిజేష్​ పటేల్​, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించారు.

IPL 2020 will face Threat from coronavirus
ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​కు కరోనా ఎఫెక్ట్ తప్పదా..?

By

Published : Mar 4, 2020, 10:15 AM IST

పలుదేశాల్ని ఇబ్బందిపెడుతున్న కరోనా (కొవిడ్‌-19).. భారత్‌నూ కలవరపెడుతోంది. కేసులు నమోదవడమే కాకుండా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణపై సందేహాలు మొదలయ్యాయి. అయితే కరోనా ప్రభావం ఐపీఎల్‌కు లేదని, షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ అన్నారు.

గంగూలీ, బ్రిజేష్​

" ఇప్పటివరకు ఐపీఎల్‌కు ఎటువంటి కరోనా ముప్పులేదు. అయితే దానిపై కూడా దృష్టిసారిస్తాం. షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ 13వ సీజన్‌ మార్చి 29 నుంచి మే 24 వరకు జరుగుతుంది"

-- బ్రిజేష్​ పటేల్​, ఐపీఎల్​ ఛైర్మన్​

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. ఇదే విషయంపై మాట్లాడాడు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌, ఐపీఎల్‌ యథావిధిగా జరుగుతాయని అన్నాడు. భారత్‌లో ఎటువంటి ఇబ్బంది లేదని... ఇప్పటివరకు కరోనా వైరస్‌ గురించి చర్చించలేదని అన్నాడు.

మూడు వన్డేల సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా జట్టు త్వరలో భారత్‌కు రానుంది బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య ఈనెల 12 నుంచి మూడు వన్డేల సిరీస్​ ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్​, లఖ్‌నవూలో 15న రెండో వన్డే, కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో 18న ఆఖరి వన్డే నిర్వహించనున్నారు.

దక్షిణాఫ్రికా X భారత్​
  • ఇవీ చూడండి...
  1. భారత పర్యటనకు వచ్చే సఫారీ జట్టిదే
  2. ఐపీఎల్​ ఉత్సవానికి ఆల్​స్టార్స్​ మ్యాచ్​తో ముగింపు
  3. ఐపీఎల్​ షెడ్యూల్​: ఆరంభ మ్యాచ్​లో ముంబయి X చెన్నై 'ఢీ'

ABOUT THE AUTHOR

...view details