ఈ ఏడాది ఐపీఎల్ ఖాళీ స్టేడియాల్లో జరిగినప్పటికీ.. ఆట నాణ్యతపై ఆ ప్రభావం ఉండదని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మార్గనిర్దేశకుడు వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. కరోనా పరిస్థితుల మధ్య బయో సెక్యూర్ వాతావరణంలో లీగ్ నిర్వహించనున్న నేపథ్యంలో లక్ష్మణ్ తన అభిప్రాయాలు తెలిపాడు. సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానుంది.
"మైదానంలో ఎక్కడా జనం లేకపోయినా, స్టాండ్స్ ఖాళీగా ఉన్నా అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లను కచ్చితంగా ఆస్వాదిస్తారని నేను భరోసా ఇవ్వగలను. మ్యాచ్‌ల తాలూకు ఉత్సాహం, ఆటలో నాణ్యత ఎంతమాత్రం తగ్గవు. అయితే యూఏఈలో పిచ్‌లు మాత్రం కొంచెం నెమ్మదిగా ఉండే అవకాశముంది. కానీ మైదాన సిబ్బంది మనల్ని ఆశ్చర్యపరిచేలా ఏమైనా చేస్తారేమో చూడాలి. ఇక్కడి స్టేడియాల్లో ఔట్ ఫీల్డ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది".
వీవీఎస్ లక్ష్మణ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్