టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫిట్నెస్ ట్రైనర్ శంకర్ బసూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ లాక్డౌన్ సమయంలో కోహ్లీ మరింత శారీరక దృఢత్వాన్ని సంపాదించాడని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సాధ్యం కాని విషయాలను విరాట్ చేసి చూపిస్తాడని అన్నారు.
కోహ్లీ ముంబయిలోని తన నివాసంలో లాక్డౌన్ సమయాన్ని గడిపాడు. క్రమం తప్పకుడా వ్యాయామం చేస్తూ.. తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. అందుకు సంబంధించిన వీడియోలనూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు.
"ఫిట్నెస్ పరంగా విరాట్ మరింత మెరుగైన స్థితిలో తిరిగి వచ్చాడు. ప్రస్తుతం అతని ప్రదర్శన గతంలో కంటే బాగుంది. ఈ విరామ సమయాన్ని శారీరక దృఢత్వం పెంపొందించుకునేందుకు కోహ్లీ మంచిగా ఉపయోగించుకున్నాడు. అతని ఆహారపు అలవాట్లను నియంత్రణలో ఉంచుకున్నాడు."
-శంకర్ బసూ, ఆర్సీబీ ఫిట్నెస్ ట్రైనర్
కాగా యూఏఈలో వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని.. పేస్ బౌలింగ్ తీరుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని బసూ తెలిపారు. ఆర్సీబీ జట్టులో భారత బౌలర్లు ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్‌లు ఉన్నారు. సరైన డైట్, ఫిట్‌నెస్‌పై వారు శ్రద్ధ వహిస్తే.. ఈ సారి ట్రోఫీ ఆర్సీబీకే దక్కే అవకాశం ఉందని బసూ ఆశాభావం వ్యక్తం చేశారు.