తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్-13​: మెరుపులన్నీ ఈ మైదానాల్లోనే!

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కాబోతుంది ఐపీఎల్​ 13వ సీజన్​. భారత్​లో అయితే జట్టుకో స్టేడియం చొప్పున ఎనిమిది వేదికల్లో నిర్వహించేవారు. కానీ, కరోనా వైరస్​ ప్రభావంతో కేవలం మూడు స్టేడియాల్లో మ్యాచ్​లు జరగనున్నాయి. ఈ టోర్నీ నిర్వహించే స్టేడియాల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.

IPL 2020 venues total details in UAE
ఐపీఎల్​

By

Published : Sep 6, 2020, 8:03 AM IST

Updated : Sep 6, 2020, 8:01 PM IST

ఆలస్యంగా అయినా సరే.. ఐపీఎల్​ అయితే జరగబోతోంది. ఎప్పుడూ ఏప్రిల్లో మొదలయ్యే ఈ లీగ్​.. ఈ సారి సెప్టెంబర్లో ఆరంభం కాబోతుంది. అదీ యూఏఈలో. అందులోనూ ఖాళీ స్టేడియాల్లో. ఈ నెల 19నే లీగ్​ ప్రారంభం కాబోతుంది. నేడే (ఆదివారం) షెడ్యూల్​ ప్రకటించబోతున్నారు. భారత్​లో మాదిరి కాకుండా కేవలం మూడు వేదికల్లోనే మ్యాచ్​లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు వేదికల విశేషాలేంటో ఓసారి చూద్దాం పదండి.

దుబాయ్​ అంతర్జాతీయ స్డేడియం (స్పోర్ట్స్​ సిటీ, దుబాయ్​)

దుబాయ్​ అంతర్జాతీయ స్డేడియం (స్పోర్ట్స్​ సిటీ, దుబాయ్​)

ఆరంభం : 2009

సామర్థ్యం : 25 వేలు

టీ20 మ్యాచ్​లు :24

సగటు స్కోరు :157

అత్యధికం : 211 (2013లో పాకిస్థాన్​పై శ్రీలంక)

అత్యల్పం : 145 (2013లో పాకిస్థాన్​పై శ్రీలంక)

అత్యధిక వ్యక్తిగత స్కోరు: 84 (2013లో పాక్​పై కుశాల్​ పెరీ0రా)

అత్యుత్తమ బౌలింగ్​ ప్రదర్శన : 5/14 (2016లో వెస్టిండీస్​పై పాకిస్థాన్​ స్పిన్నర్​ ఇమాద్​ వసీమ్​)

ప్రఖ్యాత దుబాయ్​ స్పోర్ట్స్​ సిటీలో భాగమైన దుబాయ్​ అంతర్జాతీయ స్టేడియాన్ని యూఏఈలోని అత్యుత్తమ క్రికెట్​ మైదానంగా చెప్పొచ్చు. ఇది బ్యాటింగ్​కు బాగా అనుకూలం. యూఏఈలోని మైదానాల్లో అత్యధిక సగటు టీ20 స్కోరు (157) ఉన్నది ఇక్కడే. అయితే ఈ మైదానంలో బౌండరీలు పెద్దవి. మిగతా రెండు వేదికలతో పోలిస్తే ఇక్కడ పేసర్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. మ్యాచ్​ సాగే కొద్దీ స్పిన్నర్లకూ పిచ్​ అనుకూలిస్తుంది.

షార్జా క్రికెట్​ స్టేడియం (షార్జా)

షార్జా క్రికెట్​ స్టేడియం (షార్జా)

ఆరంభం : 1982

సామర్థ్యం : 16 వేలు

టీ20 మ్యాచ్​లు :14

సగటు స్కోరు : 138

అత్యధికం : 215 (2016లో జింబాబ్వేపై అఫ్ఘానిస్థాన్)

అత్యల్పం :56 (2013లో అఫ్ఘానిస్థాన్​​​పై కెన్యా)

అత్యధిక వ్యక్తిగత స్కోరు :118 (2106లో జింబాబ్వేపై అఫ్ఘాన్ బ్యాట్స్​మన్​ మహ్మద్​ షెజాద్​)

అత్యుత్తమ బౌలింగ్​ ప్రదర్శన :5/13 (2013లో కెన్యాపై అఫ్ఘాన్​ స్పిన్నర్​ సమియుల్లా షిన్వారి)

యూఏఈలో పాత స్టేడియం ఇదే. ఎప్పుడో 1982లోనే ఈ స్టేడియాన్ని నిర్మించారు. 90ల్లో ఇక్కడ ఆసక్తికర పోరాటాలు జరిగాయి. ఆస్ట్రేలియాపై సచిన్ మెరుపు ఇన్నింగ్స్​లకు షార్జానే వేదిక. గత దశాబ్ద కాలంలో దుబాయ్​, అబుదాబి స్టేడియాలకు ప్రాధాన్యం పెరిగి ఇక్కడ మ్యాచ్​లు తగ్గిపోయాయి. ఇక్కడి పిచ్​ కూడా బాగా నెమ్మదించింది. టీ20 సగటు స్కోరు 138 మాత్రమే ఇక్కడ నమోదయ్యింది. ఇక్కడ స్పిన్నర్లదే ఆధిపత్యం.

షేక్​ జాయెద్​ స్టేడియం (అబుదాబి)

షేక్​ జాయెద్​ స్టేడియం (అబుదాబి)

ఆరంభం : 2006

సామర్థ్యం :20 వేలు

టీ20 మ్యాచ్​లు :25

సగటు స్కోరు : 147

అత్యధికం : 225 (2013లో ఐర్లాండ్​పై అఫ్ఘానిస్థాన్​)

అత్యల్పం : 130 (2010లో నెదర్లాండ్​పై కెన్యా)

అత్యధిక వ్యక్తిగత స్కోరు : 117 (2107లో పపువా న్యూ గినియాపై యూఏఈ బ్యాట్స్​మన్​ షైమర్​ అన్వర్​)

అత్యుత్తమ బౌలింగ్​ ప్రదర్శన : 4/13 (2019లో నైజీరియాపై ఐర్లాండ్​ పేసర్​ క్రెయిగ్​ యంగ్​)

యూఏఈలో అత్యధిక టీ20 మ్యాచ్​లు (25) జరిగింది ఈ స్టేడియంలోనే. ఇక్కడి పిచ్​ బ్యాటింగ్​కు, బౌలింగ్​కు సమానంగా సహకరిస్తుంది. బౌలింగ్​లో స్పిన్నర్లదే ఇక్కడ ఆధిపత్యం. నిలదొక్కుకుంటే బ్యాట్స్​మెన్​ భారీ స్కోర్లు చేయోచ్చు. స్టేడియంతో పాటు బౌండరీలు పెద్దవి కావడం వల్ల ఇక్కడ సిక్సర్లు బాదడం అంత తేలికేమి కాదు.

Last Updated : Sep 6, 2020, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details