తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ 13వ సీజన్​కు వివో గుడ్​బై

ఐపీఎల్ 13వ సీజన్ టైటిల్ స్పాన్సర్​షిప్​ ఒప్పందం నుంచి చైనా మొబైల్ సంస్ఖ వివో తప్పుకుంది. ప్రస్తుతం భారత్-చైనా​ల మధ్య నెలకొన్న పరిస్థితుల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

By

Published : Aug 4, 2020, 5:34 PM IST

Updated : Aug 4, 2020, 7:08 PM IST

ఐపీఎల్​ 13వ సీజన్​కు వివో గుడ్​బై!
ఐపీఎల్​ 13వ సీజన్​కు వివో గుడ్​బై!

ఐపీఎల్ 13వ సీజన్ స్పాన్సర్​షిప్ నుంచి తప్పుకుంది చైనా మొబైల్ సంస్థ వివో. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నడుమ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో మరో కొత్త స్పాన్సర్​ను వెతికే పనిలో పడింది బీసీసీఐ.

ఐపీఎల్‌ ప్రస్తుత సీజన్​ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు నిర్వహించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్‌లు దుబాయ్‌, అబుదాబీ, షార్జాలోని మైదానాల్లో జరగనున్నాయి. అయితే లీగ్ స్పాన్సర్స్‌లో ఏ మార్పూ లేదని, చైనా కంపెనీల స్పాన్సర్‌షిప్‌నే కొనసాగించాలని పాలక మండలి ఆదివారం నిర్ణయించింది.

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ వివో ఏడాదికి రూ.440 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తోంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇంత తక్కువ సమయంలో మరో కొత్త స్పాన్సర్‌ లభ్యం కావడం ఇంచుమించు అసాధ్యమని బోర్డు అభిప్రాయపడుతోంది. కానీ ఇప్పుడు వివో తప్పుకోవడం వల్ల బోర్డు కొత్త స్పాన్సర్​ కోసం వేట ప్రారంభించింది.

Last Updated : Aug 4, 2020, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details