దుబాయ్‌లో అడుగుపెట్టిన తర్వాత ఉన్న ఆరురోజుల క్వారంటైన్ సమయం ఎంతో కష్టంగా గడిచిందని చెప్పాడు చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోనీ. లాక్డౌన్లో ఐదు నెలలు కుటుంబసభ్యులతో గడిపిన అనంతరం ఒంటరిగా ఉండటం భారంగా అనిపించిందని అన్నాడు. ముంబయితో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ వ్యాఖ్యలు చేశాడు.
"ఆరు రోజులపాటు క్వారంటైన్లో ఉండటం చాలా కష్టంగా అనిపించింది. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతూ అకస్మాతుగా ఒక్క గదిలో ఒంటరిగా ఉండటం మాములు విషయం కాదు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇటీవల ప్రాక్టీసు కూడా బాగా చేశాం. ఇక్కడి వాతావరణానికి బాగానే అలవాటు పడ్డాం"
-ధోనీ, సీఎస్కే కెప్టెన్