యూఏఈలో ఐపీఎల్ నిర్వహించనున్న వేళ.. ఫ్రాంచైజీలకు మార్గదర్శకాలు సూచించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆటగాళ్లు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఓ లిస్టు ఏర్పాటు చేసింది. స్వదేశం నుంచి బయలుదేరిన మొదలు టోర్నమెంటులో చివరి బంతి పడే వరకు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.
ఇందులో భాగంగా లక్షణాలు లేని కొవిడ్ కేసులను తగ్గించేందుకు ఐపీఎల్ జరిగినన్ని రోజులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. వీటితో పాటు ఫ్రాంచైజీలు వేర్వేరు హోటళ్లలో బస చేయడం, డ్రెస్సింగ్ రూమ్‌ల్లో భౌతిక దూరం పాటించడం, ఎలక్ట్రానిక్ టీమ్ షీట్లు, వర్చువల్ టీమ్ సమావేశాలు తదితర మార్గదర్శకాలను అనుసరించాలని ఆదేశించింది.