తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ సారి ఐపీఎల్​.. 55 కోట్ల మందికి పైగా - ipl 2020 viewers on tv

ఐపీఎల్​ 13వ సీజన్​ను భారత్​లో బుల్లితెరపై 55కోట్ల మందికి పైగా వీక్షించే అవకాశముందన్నారు స్టార్​ ఇండియా ఛైర్మన్​ శంకర్​. 100కు పైగా దేశాల్లో ఈ లీగ్​ను ప్రసారం చేయనున్నట్లు చెప్పారు.

ipl 2020
ఐపీఎల్

By

Published : Sep 5, 2020, 7:46 AM IST

ఈ ఏడాది ఐపీఎల్​ను ప్రత్యేక్ష ప్రసారం, మిగతా ప్రసారాలు కలిపి మొత్తం భారత్​లో టీవీల్లో 55 కోట్ల మందికి పైగా వీక్షించే అవకాశముందని స్టార్​ ఇండియా ఛైర్మన్​ శంకర్​ అన్నారు.

ఐపీఎల్​ వీక్షకుల విషయంలో ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో కన్నా ఈ సారి మరింత ఎక్కువ మంది చూస్తారని నమ్ముతున్నా. ఏడు భాషల్లో ప్రసారాలు ఉండనున్నాయి. అందుకు 90మంది వ్యాఖ్యాతల బృందం సిద్ధంగా ఉంది. ప్రత్యేక్ష ప్రసారం, మిగతా ప్రసారాలు కలిపి మొత్తం భారత్​లో 55 కోట్ల మందికి పైగా ఈ సీజన్​ను టీవీల్లో వీక్షిస్తారని అంచనా వేస్తున్నాం. 100కు పైగా దేశాల్లో ఈ లీగ్​ను ప్రసారం చేయనున్నాం.

-శంకర్​, స్టార్​ ఇండియా ఛైర్మన్​

ఈ సీజన్​ ప్రకటన కోసం ఇప్పటికే 75 శాతం వాటా అమ్మడం పూర్తయిందని ఆ లీగ్​ అధికారిక ప్రసారదారు స్టార్​ స్పోర్ట్స్​ సీఈఓ గౌతమ్​ దాకర్​ వెల్లడించారు. దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10వరకు ఈ మెగాలీగ్​ జరగనుంది.

ఇదీ చూడండి యుఎస్‌ ఓపెన్‌ : ముర్రే కథ ముగిసె.. అజరెంకా ముందంజ

ABOUT THE AUTHOR

...view details