ముంబయి ఇండియన్స్ సీనియర్ బౌలర్ లసిత్ మలింగ సేవలు కోల్పోవడం చాలా బాధగా ఉందని చెప్పాడు కెప్టెన్ రోహిత్ శర్మ. జట్టుకు అతడు ఎన్నో విజయాలు అందిచాడని గుర్తు చేసుకున్నాడు. ఈ ఏడాది తమతో కలిసి ఆడకపోవడం దురదృష్టమని పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణలతో ఈ సీజన్‌కు మలింగ దూరమయ్యాడు.
"మలింగ, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ విన్నర్. జట్టుకు చాలా ఏళ్లపాటు సేవలందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి అందులో నుంచి బయటపడేశాడు. ఈ సీజన్లో అతడు లేకపోవడం చాలా బాధగా ఉంది. అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి జేమ్స్ ప్యాటిన్సన్, ధవల్ కుల్కర్ణితో పాలు పలువురిని పరిశీలిస్తున్నాం. కానీ అది అంత సులువైన పని కాదు"
-రోహిత్, ముంబయి ఇండియన్స్ సారథి