తెలంగాణ

telangana

ETV Bharat / sports

ట్రోల్స్​ దెబ్బకు నేపథ్య గీతం మార్చిన ఆర్సీబీ! - rcb theme song new version

ప్రస్తుత ఐపీఎల్ సీజన్​ కోసం సరికొత్త యాంథమ్ గీతాన్ని విడుదల చేసింది బెంగళూరు జట్టు. హిందీ, ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా ఉన్నాయని ట్రోల్స్ రావడం వల్ల కన్నడ లిరిక్స్​తో సరికొత్త పాటను ప్రేక్షకులతో పంచుకుంది.

IPL 2020: RCB release Kannada version of new anthem after uproar from fans
కోహ్లీ ఆర్సీబీ

By

Published : Sep 18, 2020, 6:20 PM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తొలి మ్యాచ్‌లోనే గెలిచి శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది. సారథి కోహ్లీ సహా ఆటగాళ్లందరూ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఇదే ఊపులో ఆ జట్టు సరికొత్త జెర్సీలు, సరికొత్త నేపథ్య గీతాన్ని ఆవిష్కరించింది.

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్‌-19తో యుద్ధం చేసేందుకు ముందు వరుసలో ఉన్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, స్వచ్ఛంద సేవకులకు ఆర్‌సీబీ నివాళి అర్పిస్తోంది. జెర్సీ వెనకా, ముందు 'మై కొవిడ్‌ హీరోస్‌' అని రాయించింది. మైదానంలో మ్యాచులు ఆడేటప్పుడు ఆటగాళ్లు వీటినే ధరించనున్నారు. ఇక శుక్రవారం ఆవిష్కరించిన ఆర్‌సీబీ నేపథ్య గీతం సైతం అద్భుతంగా ఉంది. అభిమానుల ఆశలకు తగ్గట్టుగా పాటను రూపొందించారు. అయితే తొలుత విడుదల చేసిన పాటలో స్థానిక భాష కన్నడ లేదని ట్రోల్స్ రావడం వల్ల తిరిగి మరో పాటను విడుదల చేసింది.

ఇప్పటి వరకు ఐపీఎల్‌ ట్రోఫీ అందుకోని రాయల్‌ ఛాలెంజర్స్‌ ఈ సారి పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాలను పటిష్ఠం చేసుకుంది. కోచింగ్‌ సిబ్బందిని మార్చేసింది. అంతా ప్రణాళికా బద్ధంగా, క్రమశిక్షణగా ముందుకు సాగుతున్నారు. బయోబుడగ వాతావరణానికీ త్వరగానే అలవాటు పడ్డారు. జట్టు సమావేశాలు సరదాగా సాగుతున్నాయి. సెప్టెంబర్‌ 21న ఆ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details