రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాజ్ఞిక్‌కు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. జట్టు యాజమాన్యం బుధవారం ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. సెప్టెంబరులో యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ కోసం జట్టులోని ప్రతి ఒక్కరికి కొవిడ్ పరీక్షలు చేయించడం మొదలు పెట్టిన క్రమంలో దిశాంత్కు వైరస్ సోకినట్లు తేలింది.
ఐపీఎల్: రాజస్థాన్ ఫీల్డింగ్ కోచ్‌కు కరోనా - ఐపీఎల్ 2020 కరోనా కేసులు
రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్కు కరోనా సోకింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడిని 14 రోజుల నిర్బంధంలో ఉంచనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కోచ్‌కు కరోనా పాజిటివ్
ఇదే విషయాన్ని తన ట్విట్టర్లోనూ వెల్లడించాడు కోచ్ దిశాంత్. పదిరోజులుగా తనను కలిసిన వారిని ముందు జాగ్రత్తగా కరోనా పరీక్ష చేయించుకోమని సూచించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం తాను 14 రోజుల నిర్బంధంలో ఉంటానని అన్నాడు. త్వరలోనే కోలుకుని రాజస్థాన్ రాయల్స్ జట్టుతో యూఏఈ వెళ్తానని చెప్పాడు. ఆటగాళ్లందరికీ కొవిడ్ పరీక్షలు చేయించిన తర్వాత, ఆగస్టు 20న యూఏఈకి పయనమవ్వాలని ప్రాంఛైజీలు భావిస్తున్నాయి.