సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తాను సీనియర్ బౌలర్ కావడం వల్ల.. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్లో మరింత బాధ్యత వహించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు టీమ్ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్. ఈ విషయంలో తనకు ఎటువంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్లో తమ జట్టు గెలిచేందుకు తాను కృషి చేస్తానని చెప్పాడు.
" ప్రస్తుతం నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. ఎందుకంటే.. జట్టు ఎప్పుడూ ఒక్క ఆటగాడిపైనే ఆధారపడదు. నేను సీనియర్ ఆటగాడిని కాబట్టి మరింత జాగ్రతగా ఉండాలని అనుకుంటా."