ఐపీఎల్-2020 కోసం ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ భారీగా కష్టపడుతున్నాడు. ఈసారి కూడా ఎలాగైనా ట్రోఫీని దక్కించుకోవాలనే దిశగా అడుగులేస్తున్నాడు. ప్రాక్టీసు సమయంలో భారీ సిక్సర్లు, అద్భుతమైన క్యాచ్‌లతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇలా మైదానంలో చెమటలు చిందించిన అనంతరం.. భార్య రితిక, కుమార్తె సమైరాలతో కలిసి యూఏఈలో సరదాగా గడిపే ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు.
కుమార్తెతో కలిసి చిన్నపిల్లాడిలా రోహిత్ గెంతులు - రోహిత్ శర్మ తాజా వార్తలు
ఐపీఎల్ కోసం ప్రాక్టీసు సెషన్లో చెమటలు చిందిస్తున్న రోహిత్ శర్మ.. భార్య, కుమార్తెతో కలిసి యూఏఈలో సరదాగా గడిపే ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. ఈ క్రమంలోనే శనివారం తన కుమార్తె సమైరాతో కలిసి ఆనందంగా గడిపిన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు హిట్‌మ్యాన్.
ఈ క్రమంలోనే శనివారం తన కుమార్తె సమైరాతో కలిసి ఆనందంగా గడిపిన క్షణాలను రోహిత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో సమైరా చేతులు పట్టుకుని.. చిన్నపిల్లాడిలా గెంతులేస్తూ కనిపించాడు. ఈ వీడియోను చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇటీవలే ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యులు విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి బీచ్ వద్ద ఆనందంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఫ్రాంచైజీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. కాగా సెప్టెంబరు 19న ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. సీఎస్కే జట్టుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది ముంబయి ఇండియన్స్.