తెలంగాణ

telangana

ETV Bharat / sports

అందరికంటే ముందే యూఏఈకి చెన్నై క్రికెటర్లు! - ఐపీఎల్ తాజా వార్తలు

అందరికంటే ముందే యూఏఈ చేరుకుని ఐపీఎల్ ప్రాక్టీసు మొదలుపెట్టాలని చెన్నై సూపర్​కింగ్స్ భావిస్తుంది. ఆగస్టు తొలివారంలో అక్కడికి వెళ్లనుందని సమాచారం.

ఆగస్టు తొలి వారం నుంచి చెన్నై క్రికెటర్ల శిక్షణ!
చెన్నై సూపర్​కింగ్స్

By

Published : Aug 1, 2020, 3:46 PM IST

Updated : Aug 1, 2020, 4:07 PM IST

మూడుసార్లు ఐపీఎల్​ విజేతగా నిలిచిన చెన్నై సూపర్​కింగ్స్.. ప్రాక్టీసు కోసం సర్వం సిద్ధమవుతోంది. ఆగస్టు తొలి వారం నుంచి యూఏఈలో మొదలుపెట్టాలని భావిస్తోంది.

చెన్నై సూపర్​కింగ్స్ కెప్టెన్ ధోనీ

కరోనా కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ సీజన్.. నిరవధిక వాయిదా పడింది. ఇటీవలే ఐపీఎల్​ నిర్వహణ గురించి మాట్లాడిన ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్.. సెప్టెంబరు 19-నవంబరు 10 మధ్య టోర్నీ జరగనుందని స్పష్టం చేశారు. కాకపోతే భారత్​ బదులు యూఏఈ ఆతిథ్యమిస్తుందని చెప్పారు. అయితే ఆగస్టు 2న జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశం తర్వాత వీటన్నింటిపై పూర్తి స్పష్టత రానుంది.

సీఎస్కే క్రికెటర్లు తొలుత చెన్నైకి చేరుకుంటారని, భారత ప్రభుత్వం అనుమతి లభించిన తర్వాత ప్రత్యేక విమానంలో యూఈఏ చేరుకుంటారని సమాచారం. అన్ని జట్ల కంటే ముందే ఆతిథ్య దేశానికి చేరుకుని శిక్షణలో మునిగితేలాలని ధోనీసేన భావిస్తుంది.

Last Updated : Aug 1, 2020, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details