టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, చెన్నై సూపర్‌కింగ్స్ సభ్యుడు షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. 40 ఏళ్ల వయసులోనూ అలుపెరగకుండా, ధోనీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు. మహీకి తాను పెద్ద అభిమాని అని.. క్రికెట్లో అతను కొంతకాలం కొనసాగాలని అభిప్రాయపడ్డాడు.
"ధోనీ.. క్రికెట్‌ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. ప్రస్తుత ఆటగాళ్లలో అతడే ఎవర్గ్రీన్. వయసు మళ్లిన క్రికెటర్‌గా అసలు కనిపించడు. 40 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ను కాపాడుకుంటున్నాడు. వికెట్ల మధ్య మహీ పరుగు, వికెట్‌కీపర్ నైపుణ్యం ఉత్తమం. అతడికి నేను పెద్ద అభిమానిని. ఐపీఎల్లోపాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ మహీ కొనసాగాలని కోరుకుంటున్నా. యూఏఈలో పిచ్‌లు మందకొడిగా ఉంటాయి. అందువల్ల చెన్నై జట్టులో ఉత్తమ స్పిన్నర్లను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది"