తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో ముంబయి జట్టుకు ఎదురుదెబ్బ.. - bcci news

ఈ ఏడాది ఐపీఎల్​కు దూరమయ్యాడు ముంబయి ఇండియన్స్​ పేసర్​ లసిత్​​ మలింగ. కుటుంబంతో కలిసి గడపాలని కోరుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Malinga makes himself unavailable
మలింగ

By

Published : Sep 2, 2020, 9:09 PM IST

ఐపీఎల్​ 13వ సీజన్​ ముంగిట ముంబయి ఇండియన్స్​ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్​ పేసర్​ లసిత్​ మలింగ.. ఈ ఏడాది ఐపీఎల్​ సీజన్​ నుంచి తప్పుకున్నాడు. కరోనా కాలంలో కుటుంబంతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటున్నాడని.. ముంబయి జట్టు యజమాని ఆకాశ్​ అంబానీ వెల్లడించారు. మలింగ స్థానంలో ఆస్ట్రేలియా పేసర్​ జేమ్స్​ ప్యాటిన్సన్​ను జట్టులో నియమించినట్లు ప్రకటించారు.

"ఈ ఐపీఎల్​లో మాకు సరైన బౌలర్​ జేమ్స్​ అని నమ్ముతున్నాం. మలింగ ముంబయి జట్టుకు మూల స్తంభం. సీజన్​లో అతని ప్రదర్శనను కోల్పోతున్నామనే వాస్తవాన్ని అంగీకరిస్తున్నాం. తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలనే అతని నిర్ణయాన్ని మేము పూర్తిగా అర్థం చేసుకున్నాం".

ఆకాశ్​ అంబానీ, ముంబయి జట్టు యజమాని

2009లో ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన మలింగ.. లీగ్​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు 122 మ్యాచ్​లు ఆడగా.. 19.80 సగటుతో 170 వికెట్లు పడగొట్టాడు. ప్యాటిన్సన్​ తొలిసారి లీగ్​లో అరంగేట్రం చేయనున్నాడు.

ABOUT THE AUTHOR

...view details