తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​కు ఆలస్యంగా స్టార్ బౌలర్ మలింగ!

శ్రీలంక పేసర్, ముంబయి ఇండియన్స్ ఆటగాడు లసిత్ మలింగ్ ఐపీఎల్​లో ఆలస్యంగా బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అతడి తండ్రి అనారోగ్యంతో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఐపీఎల్​కు ఆలస్యంగా స్టార్ బౌలర్ మలింగ
ఐపీఎల్​కు ఆలస్యంగా స్టార్ బౌలర్ మలింగ

By

Published : Aug 22, 2020, 7:24 AM IST

శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ ఈసారి ఐపీఎల్‌లో తమ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆలస్యంగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అతడి తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడని, కొద్ది రోజుల్లో శస్త్రచికిత్స జరగనుందని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. ఈ కారణం చేతనే అతడిప్పుడు తన తండ్రి వద్ద ఉండాలనుకున్నట్లు, తర్వాత ఐపీఎల్‌లో కీలక సమయం వచ్చేసరికి యూఏఈలో జట్టుతో కలిసిపోతాడని తెలిపింది. అయితే, ఈ విషయంపై ముంబయి ఇండియన్స్‌ కానీ, మలింగ కానీ స్పందించలేదు.

ముంబయి జట్టు ఈరోజు ఉదయమే అబుదాబికి పయనమైంది. ప్రత్యేక పీపీఈ కిట్లు ధరించిన ఆటగాళ్లు ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించి ముంబయి విమానాశ్రయం నుంచి బయలుదేరివెళ్లారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఆ జట్టు సోషల్‌మీడియాలో పంచుకుంది.

మలింగ 2009 నుంచీ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌తోనే కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు 170 తీసిన బౌలర్‌గా ఉన్నాడు. గతేడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆడిన ఫైనల్‌ మ్యాచ్‌లోనూ మలింగ మాయ చేశాడు. చివరి ఓవర్‌ వేసిన అతడు ఆ జట్టుకు చారిత్రక విజయం అందించాడు. 9 పరుగులు చేస్తే సీఎస్కే గెలుస్తుందనగా 7 పరుగులే ఇచ్చాడు. అలాగే చివరి బంతికి శార్దుల్‌ ఠాకుర్‌ను ఔట్‌ చేసి ఉత్కంఠ పోరుకు తెరదించాడు. దీంతో ముంబయి ఇండియన్స్‌ నాలుగోసారి టైటిల్‌ సాధించింది.

ABOUT THE AUTHOR

...view details