తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ 2020 : భారత మేటి బ్యాట్స్​మెన్​ వీరే! - ఐపీఎల్​ 2020

ఐపీఎల్​ 13వ సీజన్ ప్రారంభం దగ్గర పడే కొద్దీ క్రీడాభిమానుల్లో ఉత్కంఠ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పూర్తయిన 12 సీజన్లలో టాప్​ టెన్ బ్యాట్స్​మెన్ సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

IPL
ఐపీఎల్

By

Published : Sep 15, 2020, 10:10 AM IST

Updated : Sep 15, 2020, 11:50 AM IST

మరో ఐదు రోజుల్లో ఐపీఎల్​ 13వ సీజన్​ ప్రారంభంకానుంది. కరోనాతో ఢీలా పడిన క్రీడాభిమానులకు పొట్టి క్రికెట్​తో కాస్తంత ఊరట లభించనుంది. రోహిత్​ మెరుపులు, కోహ్లీ అరుపులు, ధోనీ వ్యూహాలతో మైదానాలు సందడిగా మారనున్నాయి. బ్యాట్స్​మెన్, బౌలర్ల మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా సాగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ప్రీమియర్​ లీగ్​లన్నింటిలో టాప్​ టెన్​ బ్యాట్స్​మెన్ రికార్డులపై ఓ లుకేద్దాం.

విరాట్​ కోహ్లీ

విరాట్​ కోహ్లీ.. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఇప్పటివరకు ఒక్క ట్రోఫీని జట్టుకు అందించలేకపోయాడు. కానీ రికార్డుల పరంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇతర ఏ ఆటగాడు చేయలేనంతగా 5,412 పరుగులు చేసి ఐపీఎల్​లో చరిత్ర సృష్టించాడు. ఇక 2016 సంవత్సరం విరాట్​కు ప్రత్యేకమనే చెప్పాలి. ఆ ఏడాది ఏకంగా నాలుగు సెంచరీలు బాదాడు. ఆ సీజన్​లో 152.03 స్ట్రైక్​రేట్​తో 973 పరుగులు సాధించాడు.

మొత్తంగా ఐపీఎల్​ కెరీర్​లో ఇప్పటివరకు 177 మ్యాచులు ఆడాడు కోహ్లీ. సగటు 37.84. 131.61 స్ట్రైక్​ రేటుతో 5,412 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 113గా ఉంది.

కోహ్లీ

రోహిత్​ శర్మ

రోహిత్ శర్మ.. ముంబయి ఇండియన్స్​ సారథి. ఏ జట్టు సాధించలేనంతగా నాలుగు సార్లు జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు. ఐపీఎల్​ కెరీర్​లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 4,898 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఓపెనింగ్​, మిడిలార్డర్, ఫినిషర్​ ఇలా ఏ స్థానంలో అయినా రాణించగలడు.

మొత్తంగా ఐపీఎల్​ కెరీర్​లో రోహిత్​ 188 మ్యాచులు ఆడాడు. సగటు 31.60. 130.82 స్ట్రైక్​ రేట్​తో 4,898 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 109 నాటౌట్​. ఒక సెంచరీ మాత్రమే సాధించాడు.

రోహిత్​

రిషభ్​ పంత్​

యువ వికెట్​ కీపర్​ బ్యాట్స్​మన్​ రిషభ్​ పంత్.. ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2018లో 14 మ్యాచుల్లో 173.60స్ట్రైక్​రేట్​తో అదరగొట్టాడు. తొలి ఐదు స్థానాల్లో బ్యాటింగ్​కు దిగి పవర్​ హిట్టింగ్​తో ఆకట్టుకుంటాడు. పేస్​, స్పిన్​ బౌలింగ్​ను బాగా ఎదుర్కోగలడు.

మొత్తంగా ఐపీఎల్​ కెరీర్​లో 54 మ్యాచులు ఆడాడు పంత్. సగటు 36.16. 162.69 స్ట్రైక్​రేట్​తో 1,736 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 128 నాటౌట్​. ఒక సెంచరీ సాధించాడు.

రిషభ్​పంత్​

కేఎల్​ రాహుల్

కేఎల్​ రాహుల్​.. ప్రస్తుతం కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత రెండు సీజన్లలో 1200 పరుగులు సాధించి తన సామార్థ్యాన్ని నిరూపించుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మొత్తంగా ఐపీఎల్​ కెరీర్​లో 67 మ్యాచులు ఆడాడు. సగటు 42.06. స్ట్రైక్​రేట్​ 138.15తో 1,977 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 100 నాటౌట్​. ఓ సెంచరీ సాధించాడు.

కేఎల్​ రాహుల్​

శిఖర్​ ధావన్​

శిఖర్​ ధావన్.. దిల్లీ క్యాపిటల్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2018, 2019 సీజన్​లలో 497, 521 పరుగులతో అదరగొట్టాడు. టాపార్డర్​లో బ్యాటింగ్​కు దిగే ఇతడు మైదానంలో బౌలర్లపై విరుచుకుపడతాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించగలడు.

మొత్తంగా ఐపీఎల్​ కెరీర్​లో 159 మ్యాచులు ఆడాడు. సగటు 33.42. 124.80 స్ట్రైక్​ రేట్​తో 4579 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 97 నాటౌట్​.

శిఖర్​ ధావన్​

మహేంద్రసింగ్​ ధోనీ

మహేంద్రసింగ్​ ధోనీ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు. కానీ పసుపు జెర్సీలో మరిన్ని మెరుపులు మెరిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. తన సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్​కు మూడు సార్లు ట్రోఫీని అందించాడు. కెప్టెన్​గా అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

మొత్తంగా కెరీర్​లో 190 మ్యాచులు ఆడాడు మహీ. సగటు 42.20. స్ట్రైక్​రేట్​ 137.85తో 4432 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్​.

ధోనీ

మనీశ్​ పాండే.

మనీశ్​ పాండే.. తనదైన బ్యాటింగ్​ శైలితో మైదానంలో అద్భుతాలు సృష్టించాడు. కానీ కోల్ కతా నైట్ రైడర్స్​లో ఉన్నపుడు రసెల్ వల్ల, సన్​రైజర్స్​లో వార్నర్, బెయిర్ స్టో వల్ల ఇతడికి అంతగా పేరు రాలేదు. గతేడేది మిడిలార్డర్​లో బ్యాటింగ్​ దిగిన ఇతడు 130.79 స్ట్రైక్​ రేట్​తో 344 పరుగులు చేశాడు. ఈ సీజన్​కు సన్​రైజర్స్​కే ఆడుతున్నాడు.

మొత్తంగా కెరీర్​లో 130 మ్యాచ్​లు ఆడాడు. సగటు 29.30. స్ట్రైక్​రేట్​ 120.82తో 2,843పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 114 నాటౌట్​. ఓ సెంచరీ బాదాడు.

మనీశ్​ పాండే

శుభమన్​ గిల్

యువ బ్యాట్స్​మన్​ శుభమన్​ గిల్​.. 2018లో కోల్​కతా నైట్​రైడర్స్​​ తరఫున బాగా ఆడి వెలుగులోకి వచ్చాడు. గత రెండు సీజన్​లలో 499 పరుగులు చేశాడు. నాలుగు అర్ధ శతకాలు బాదాడు. అండర్​-19 ప్రపంచకప్​ విజయంలో ఇతడి పాత్ర ఎంతో కీలకం.

మొత్తంగా ఐపీఎల్​ కెరీర్​లో 27 మ్యాచులు ఆడాడు గిల్. సగటు 33.26. స్టైక్​రేట్​ 132.36తో 499 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 76.

శుభమన్​ గిల్​

సంజూ శాంసన్

సంజూ శాంసన్​(రాజస్థాన్​ రాయల్స్​).. ఐపీఎల్​లో బాగా రాణించి టీమ్​ఇండియాలో చోటు కూడా సంపాదించుకున్నాడు. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మొత్తంగా లీగ్​​ కెరీర్​లో 93 మ్యాచులు ఆడాడు. సగటు 27.61. స్ట్రైక్​రేట్​ 130.24తో 2,209 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 102 నాటౌట్​. రెండు సెంచరీలు బాదాడు.

సంజు

పృథ్వీ షా

అండర్​-19 ప్రపంచకప్​ విజేతగా నిలిచిన టీమ్​ఇండియా సారథి పృథ్వీ షా(దిల్లీ క్యాపిటల్స్​).. భారత క్రికెట్​లో స్టార్​ ఆటగాడిగా పేరు సంపాదించుకుంటున్నాడు. గత సీజన్​లో 133.71 స్ట్రైక్​రేట్​తో 353 పరుగులు సాధించాడు.

మొత్తంగా కెరీర్​లో 25 మ్యాచులు ఆడాడు. 141.03 స్ట్రైక్​ రేట్​తో 598 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 99.

పృథ్వీ షా

ఇదీ చూడండి 'ధోనీలా మంచి ఫినిషర్​ కావాలనుంది'

Last Updated : Sep 15, 2020, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details