ఐపీఎల్ నిర్వహణకు అన్ని అడ్డంకులు తొలగిపోతే తాను లీగ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అన్నాడు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ వాయిదా పడటం వల్ల.. లీగ్ జరిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలోనే క్రికెటర్లందరి దృష్టి ఈ లీగ్‌పైనే నెలకొంది. కరోనా సోకకుండా వైద్య సంరక్షణ పరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. తాను ఈ ఐపీఎల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు గ్లెన్ పేర్కొన్నాడు.
"ప్రస్తుతం మనం వేచి చూడాల్సిందే. ప్రయాణ సదుపాయాలు, క్వారంటైన్ సమయం తదితర విషయాలన్నింటిపై ఓ స్పష్టత కావాలి. సమస్యలన్నింటికీ పరిష్కారం చూపగలిగితే నేను ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. విదేశీ ఆటగాళ్లు అందులో ఆడుతున్నారు. ఈ లీగ్‌ను అందరూ ప్రపంచ కప్ మాదిరిగానే భావిస్తున్నారు."