ఐపీఎల్లో పాల్గొనేందుకు మహేంద్రసింగ్ ధోనీ ఆగస్టు 14న చెన్నైకి చేరుకున్నాడు. ఆగస్టు 15 నుంచి సీఎస్కే శిక్షణా శిబిరంలో ప్రారంభమయ్యే ఐదు రోజుల ప్రీ సెషన్లో పాల్గొననున్నాడు. మహీతో పాటు సీఎస్కే జట్టు ఆటగాళ్లు సురేశ్ రైనా, కరణ్ శర్మ, దీపక్ చాహర్, పియూష్ చావ్లా కూడా చెన్నైకి చేరుకున్నారు. ఖాళీ స్డేడియంలోనే ఆటగాళ్లు శిక్షణ ప్రారంభించనున్నారు.
ఇప్పటికే వీరందరూ చెన్నైకి చేరుకునేముందు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ వైద్య పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు సీఎస్కే ఫ్రాంచైజీ తెలిపింది. యూఈఏ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు.. బయోసెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ జరగనుంది.