తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ 2020: దిల్లీ క్యాపిటల్స్​కు అశ్విన్ బదిలీ​! - ipl season 13

సీనియర్​ బౌలర్​ రవిచంద్ర అశ్విన్​ వచ్చే ఏడాది ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ తరఫున బరిలోకి దిగనున్నట్లు సమాచారం. తాజాగా ఇతడిని దిల్లీ జట్టుకు బదిలీ చేసిందట పంజాబ్​ ఫ్రాంచైజీ. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

ఐపీఎల్​ 2020: దిల్లీ క్యాపిటల్స్​కు అశ్విన్ బదిలీ​!

By

Published : Nov 6, 2019, 6:45 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్​)​ 13వ సీజన్ కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఫ్రాంచైజీలు ఆటగాళ్ల ట్రేడింగ్‌ జరపడంలో బిజీగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది డిసెంబర్​ 19న కొత్త ఆటగాళ్ల కోసం వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఐపీఎల్​ యాజమాన్యం. తాజాగా కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​... అశ్విన్​ను బదిలీ రూపంలో దిల్లీ క్యాపిటల్స్​కు ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో ప్రకటన రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

పంజాబ్​ జట్టు జెర్సీలో అశ్విన్​

తొలుత వెనక్కితగ్గినా...

భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ విషయంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ మొదట చాలా సందిగ్ధంలో పడింది. అయితే ఐపీఎల్ 2019 సీజన్‌లో కెప్టెన్‌గా జట్టుని సమర్థంగా అశ్విన్ నడిపించలేకపోయాడని భావించిన పంజాబ్ యాజమాన్యం.. అతణ్ని దిల్లీ క్యాపిటల్స్‌కి ఇచ్చేసి ఆ జట్టు నుంచి అశ్విన్‌ ధరకి సమానమైన ఆటగాళ్లని తీసుకోవాలని చర్చలు జరిపింది. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రధాన కోచ్‌ అనీల్ కుంబ్లే అందుకు ఒప్పుకోలేదు. తాజాగా అతడు అంగీకరించినట్లు సమాచారం.

పంజాబ్​ కోచ్​ అనీల్​ కుంబ్లే

గత ఏడాది ఐపీఎల్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఓపెనర్ శిఖర్ ధావన్‌ను ఇదే పద్దతిలో తీసుకుంది దిల్లీ క్యాపిటల్స్. ఫలితంగా విజయ్ శంకర్‌తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లని హైదరాబాద్‌కి బదిలీ రూపంలో ఇచ్చింది దిల్లీ.

గతేడాది ఐపీఎల్​ ట్రోఫీ

2018 సీజన్‌లో రూ.7.6 కోట్లకి పంజాబ్ జట్టులో చేరిన అశ్విన్ ఆ తర్వాత జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 2019 సీజన్‌లో 14 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా గత సీజన్‌లో మన్కడింగ్‌కు పాల్పడి పెద్ద వివాదానికి తెర లేపాడు. అయితే అశ్విన్ దిల్లీ గూటికి చేరితే అతని స్థానంలో కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ అప్పగించనున్నారని తెలుస్తోంది. అశ్విన్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అజింక్య రహానేనూ తమ జట్టులోకి తీసుకొనేందుకు దిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details