కరోనా బారిన పడ్డ చెన్నై సూపర్‌కింగ్స్ ఫాస్ట్‌బౌలర్ దీపక్ చాహర్.. వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పటికే చేసిన పరీక్షలో కరోనా లేదని తేలగా, రెండోసారి నిర్వహించిన పరీక్షలోనూ నెగెటివ్ రావడం వల్ల అతడు జట్టుతో కలిశాడు.
చెన్నై బౌలర్ దీపక్ చాహర్‌కు నెగెటివ్ - ఐపీఎల్
సీఎస్కే పేసర్ దీపక్ చాహర్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. బుధవారం, రెండోసారి చేసిన పరీక్షల్లోనూ నెగెటివ్‌గా తేలడం వల్ల జట్టుతో కలిశాడు. మరోసారి నెగెటివ్‌గా తేలితేనే సాధనకు అతడిని అనుమతిస్తారు.
సీఎస్కే బౌలర్ దీపక్ చాహర్‌కు కరోనా నెగెటివ్
"దీపక్ రెండుసార్లు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా తేలడం వల్ల జట్టు తిరిగి బబుల్‌లోకి వచ్చాడు" అని చెన్నై సూపర్‌కింగ్స్ సీఈఓ విశ్వనాథన్ వెల్లడించాడు. దీపక్ ఏమేర కోలుకున్నాడో తెలుసుకునేందుకు హృదయ నాళ పరీక్ష కూడా చేయనున్నారు. మరోసారి కరోనా నెగెటివ్‌గా తేలాక అతడ్ని సాధనకు అనుమతిస్తారు.