ఐపీఎల్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా - Suresh Raina ruled out of IPL
11:27 August 29
ఐపీఎల్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు వైదొలుగుతున్నట్లు సీఎస్కే ఫ్రాంచైజీ వెల్లడించింది. ఈ సమయంలో రైనాకు జట్టు పూర్తి మద్దుతుగా నిలస్తుందని తెలిపింది.
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు పలికిన అరగంటకే రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించి అభిమానుల్ని నిరాశకు గురిచేశాడు. దీంతో అందరూ ఇతడి ఆటను ఐపీఎల్లో అయినా చూడొచ్చని అనుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఈ లీగ్‌కు కూడా దూరమయ్యాడు.