దేశంలో కొవిడ్-19 తగ్గుముఖం పట్టిన తర్వాత ఐపీఎల్ నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి యోచిస్తోంది. సెప్టెంబరు 25 నుంచి నవంబరు 1 మధ్య టోర్నీ జరిపే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేశంలో కరోనా కేసులు అప్పటికి తగ్గుముఖం పట్టవచ్చనే ఆశాభావంతో ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే దీనితో పాటు అనేక విషయాలపై త్వరలో చర్చించనుంది బీసీసీఐ.
ఈ విషయంపై ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ అధికారి మాట్లాడుతూ .."అవును, మేము ఈ తేదీలపై దృష్టిసారించాం. కానీ, అదంతా దేశంలో కరోనా పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయితే దేశంలో కేసుల సంఖ్య త్వరలోనే తగ్గుముఖం పట్టొచ్చని ఆశిస్తున్నాం" అని తెలిపాడు.