ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణకు తాత్కాలిక షెడ్యూల్‌ను పరిశీలిస్తోంది బీసీసీఐ. సెప్టెంబరు 26 (శనివారం) నుంచి నవంబరు 8 (ఆదివారం) వరకు 44 రోజుల పాటు టోర్నీని జరపాలని భావిస్తోందట. మొత్తం 60 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ షెడ్యూల్‌పై బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియా అసంతృప్తి వ్యక్తం చేస్తోందని సమాచారం. నవంబరు 14న దీపావళి ఉండగా.. ఆ వారంతం వరకు ఐపీఎల్ కొనసాగించాలని స్టార్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ప్రణాళిక చేసిన షెడ్యూల్లో మధ్యాహ్నం మ్యాచ్‌ల ద్వారా రేటింగ్‌లపై ప్రభావం పడుతుందని ప్రసారదారు ఆందోళన చెందుతోందని అధికారులు తెలిపారు.
ఐపీఎల్ పూర్తయిన తర్వాత టీమ్ఇండియా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలని నిర్ణయించింది బీసీసీఐ. డిసెంబరు తొలి వారంలో మొదలు కానున్న టెస్టు సిరీస్ కోసం నవంబరులోనే జట్టు బయలుదేరాల్సి ఉంది.