తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ నాలుగో స్థానంలో ఆడితే మంచిది' - Batting at No. 4 will be ideal for MS Dhoni

ఐపీఎల్​లో సీఎస్కే సారథి మహేంద్ర సింగ్​ ధోనీ నాలుగో స్థానంలో ఆడాలని అభిప్రాయపడ్డాడు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్​ మైకెల్​ హస్సీ. మిడిల్​ ఆర్డర్ బ్యాట్స్​మెన్ పరిస్థితులకు అనుగుణంగా ఆడితే మంచి ఫలితాలొస్తాయని తెలిపాడు.

Batting at No. 4
ధోనీ

By

Published : Aug 15, 2020, 5:38 PM IST

దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్​ 13వ సీజన్ జరగనుంది. ఈ నేపథ్యంలో తమ జట్టు బలబలాలు గురించి మాట్లాడాడు సీఎస్కే బ్యాటింగ్ కోచ్​ మైకెల్​ హస్సీ. బ్యాటింగ్​ జట్టుకు బలం అని చెప్పాడు. మిడిల్​ఆర్డర్​లో ఆడేవారు పరిస్థితుల ఆధారంగా సమతుల్యం చేసుకుంటూ ఆడాలని సూచించాడు. దీని ద్వారా జట్టు విజయం సాధించే అవకాశం ఉందని అన్నాడు. దీంతో పాటు ధోనీ 4వ స్థానంలో ఆడడం మంచిదని అభిప్రాయపడ్డాడు.

ధోనీ

జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారని, వారికి పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలో తెలుసని అన్నాడు హస్సీ​. వీరంతా జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపాడు.

"ఖాళీ స్టేడియాల్లో, బయోసెక్యూర్​ వాతవరణంలో జరగబోతున్న ఈ మెగాటోర్నీ కోసం ఎంతో ఉత్సహాంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రతి ఒక్కరి ఆరోగ్య క్షేమం కోసం నిబంధనలు పాటించాలి. ప్రేక్షకులు స్టేడియంలో లేనప్పటికీ.. ఆటగాళ్లు మునపటి ఉత్సాహంతోనే ఆడతారని భావిస్తున్నా."

-మైకెల్​ హస్సీ, సీఎస్కే కోచ్​

ఐపీఎల్​లో పాల్గొనేందుకు ఆగస్టు 15 నుంచి 20 వరకు సీఎస్కే శిక్షణా ప్రారంభించింది. మహీతో పాటు సీఎస్కే జట్టు ఆటగాళ్లు సురేశ్​ రైనా, కరణ్​ శర్మ, దీపక్​ చాహర్​, పియూష్​ చావ్లా తదితర ఆటగాళ్లు చెన్నైకి చేరుకుని ఖాళీ స్డేడియంలోనే శిక్షణ చేస్తున్నారు. వీరందరికీ కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్​ వచ్చింది. ఆగస్టు 21న సీఎస్కే బృందం దుబాయ్​కు వెళ్లే అవకాశముంది. హెడ్​ కోచ్​ స్టీఫెన్​ ఫ్లెమింగ్​, బ్యాటింగ్​ కోచ్​ మైకెల్​ హస్సీ ఆగస్టు 22న జట్టుతో దుబాయ్​లో కలుస్తారు.

ఇది చూడండి ఐపీఎల్​ ముంగిట సీఎస్కే బృందంతో ధోనీ

ABOUT THE AUTHOR

...view details