తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పౌర' నిరసనల నడుమ యథావిధిగా ఐపీఎల్ వేలం - CAA

పౌర చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 19న కోల్​కతాలో జరగనున్న ఐపీఎల్ వేలాన్ని అనుకున్న ప్రకారమే నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

IPL 2020 Auction To Go Ahead As Scheduled Despite Protests Over CAA
బంగాల్​లో పౌర నిరసనలు.. యథావిధిగా ఐపీఎల్ వేలం

By

Published : Dec 17, 2019, 9:20 AM IST

పార్లమెంటులో పౌరసత్వ చట్ట సవరణ ఆమోదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ సెగ ఈ నెల 19న జరగనున్న ఐపీఎల్ వేలానికి తాకనుంది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే కోల్​కతా వేదికగా వేలం నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది.

"సోమవారం సాయంత్రం నుంచే వేలం ఏర్పాటు ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఫ్రాంఛైజీ యాజమాన్యాలు కోల్​కతాకు రానున్నాయి. బుధవారం ఉదయానికి అక్కడకు చేరుకుంటారు. అనుకున్న ప్రకారమే వేలం జరుగుతుంది" -బీసీసీఐ ప్రతినిధి

ఐపీఎల్​ వేలం

ఈ వేలానికి 332 ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్​వెల్, దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నమోదు చేశారు. ఈ సీజన్​లో మొత్తం 73 స్థానాలను భర్తీ చేసేందుకు 8 ఫ్రాంఛైజీలు పోటీపడుతున్నాయి. ఇందులో 29 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

ఇదీ చదవండి: ఆసీస్​ క్రికెట్లో మరో మిస్సైల్.. మెరిపిస్తున్న లబుషేన్​

ABOUT THE AUTHOR

...view details