ఐపీఎల్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అయితే లీగ్ కోసం యూఏఈ వెళ్లిన క్రికెటర్లు ఎక్కడున్నారు? లీగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడెక్కడ, ఏ సమయాల్లో మ్యాచ్‌లు జరగనుంది? లాంటి వివరాలు మీకోసం.
ఐపీఎల్
By
Published : Aug 26, 2020, 1:26 PM IST
క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ కొద్దిరోజుల్లో మొదలుకానుంది. అయితే కరోనా ప్రభావం వల్ల భారత్ బదులు యూఏఈలో నిర్వహించనున్నారు. ఫ్రాంచైజీలన్నీ ఇప్పటికే దుబాయ్ చేరుకుని, హోటళ్లలో క్వారంటైన్లో ఉన్నారు. విదేశాల్లో లీగ్ జరగనుండటం ఇది మూడోసారి. గతంలో లోక్‌సభ ఎన్నికలుండటం వల్ల దక్షిణాఫ్రికా(2009), యూఏఈ(2014)లో లీగ్ జరిపారు.
ప్రస్తుత సీజన్ 53 రోజుల పాటు సాగనుంది. గతేడాది ఫైనల్లో తలపడ్డ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈసారి సెప్టెంబరు 19న తొలిమ్యాచ్ ఆడనున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్-2020 ప్రారంభం నుంచి ముంగింపు వరకు ఎలా జరగనుంది. ఏఏ సమయాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లాంటి ఆసక్తికర విషయాలు మీకోసం.
ఐపీఎల్‌ను ఎక్కడ నిర్వహిస్తారు?
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ నిర్వహించనున్నారు. దుబాయ్, షార్జా, అబుదాబీ మైదానాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఫ్రాంచైజీలన్నీ ఎప్పుడు యూఏఈకి వస్తాయి? వారి బసతో పాటు, ప్రాక్టీసు ఎక్కడ చేస్తారు?
మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు ఇప్పటికే యూఏఈకి చేరుకున్నాయి. దుబాయ్, అబుదాబీలోని హోటళ్లలో గదులు బుక్ చేసుకుని వారు ఉన్నారు. ఈ సమయంలో ఆరురోజుల్లో మూడుసార్లు కరోనా పరీక్షలు చేస్తారు. అందులో నెగటివ్ వస్తేనే బయో బబుల్‌లోకి అనుమతిస్తారు.
తొలి మ్యాచ్ ఎప్పుడు?
సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
ఫైనల్ మ్యాచ్?
టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన జట్లు.. నవంబరు 10న జరిగే ఫైనల్లో ట్రోఫీ కోసం తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను(మంగళవారం) వారం మధ్యలో జరపడం ఇదే తొలిసారి.
మ్యాచ్‌లు నిర్వహించే సమయం?
మధ్యాహ్నం 3.30 గంటలు(యూఏఈ సమయం 2.00) రాత్రి 7.30 గంటలు(యూఏఈ సమయం 6.00).
చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్
గతేడాది రన్నరప్ గా నిలిచిన సీఎస్కే.. ఈ ఏడాది ప్రారంభ మ్యాచ్‌ల్లో సామ్ కరన్, జోష్ హేజిల్‌వుడ్‌లను మిస్ కానుంది. ప్రస్తుతం వారు తమ దేశం తరఫున అంతర్జాతీయ సిరీస్‌తో బిజీగా ఉన్నారు.
పేరు
జీతం
ధోనీ
INR 150000000
సురేశ్ రైనా
INR 110000000
కేదార్ జాదవ్
INR 78000000
రవీంద్ర జడేజా
INR 70000000
పియూష్ చావ్లా
INR 67500000
డ్వేన్ బ్రావో
INR 64000000
సామ్ కరన్
INR 55000000
కర్ణ్ శర్మ
INR 50000000
షేన్ వాట్సన్
INR 40000000
పేరు
జీతం
శార్దూల్ ఠాకూర్
INR 26000000
అంబటి రాయుడు
INR 22000000
హర్బజన్ సింగ్
INR 20000000
మురళీ విజయ్
INR 20000000
జోష్ హేజిల్‌వుడ్
INR 20000000
డుప్లెసిస్
INR 16000000
ఇమ్రాన్ తాహిర్
INR 10000000
దీపక్ చాహర్
INR 8000000
లుంగి ఎంగిడి
5000000
పేరు
జీతం
మిచెల్ సాంట్నర్
INR 5000000
కేఎమ్ ఆసిఫ్
INR 4000000
నారాయణ్ జగదీశన్
INR 2000000
మోను కుమార్
INR 2000000
రుతురాజ్ గైక్వాడ్
INR 2000000
ఆర్. సాయి కిశోర్
INR 2000000
దిల్లీ క్యాపిటల్స్
దిల్లీ క్యాపిటల్స్
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్ కారణంగా.. ఈ ఏడాది దిల్లీ క్యాపిటల్స్.. అలెక్స్ క్యారీ, జేసన్ రాయ్, మార్కస్ స్టోయినిస్‌లు ప్రారంభ మ్యాచ్‌ల్లో మిస్ కానుంది.