ఐపీఎల్ 13వ సీజన్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు క్రీడాభిమానులు. ఈ మెగా లీగ్ కోసం ఇప్పటికే జట్లన్నీ దుబాయ్ చేరుకోవడం సహా క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీసు కూడా మొదలుపెట్టేశాయి. అయితే టోర్నీలో పాల్గొనే క్రికెటర్లలో కొంతమంది తమ కుటుంబాలతో కలిసి యూఏఈకి వచ్చారు. మైదానంలో తమ జీవిత భాగస్వాములు బ్యాట్, బంతితో విజృంభిస్తుంటే స్టాండ్స్‌లో కూర్చొని ప్రత్యక్షంగా చూసి ఆనందించేందుకు ఆటగాళ్ల సతీమణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జంటగా వెళ్లిన ఆటగాళ్లు ఎవరు? వారు ఏమి చేస్తున్నారు? ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం.
రోహిత్ శర్మ
ముంబయి ఇండియన్స్ జట్టుకు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన సారథి రోహిత్ శర్మ. ఈ మెగాలీగ్‌లో పాల్గొనేందుకు సతీసమేతంగా దుబాయ్ చేరుకున్నాడీ ఆటగాడు. భార్య రితికా సింగ్‌తో కసరత్తులు చేస్తూ, కూతురు సమైరాతో సినిమాలు చూస్తూ క్వారంటైన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తునాడు. వాటికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నాడు.
కోహ్లీ