సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా ఘనవిజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.19 బంతుల్లో 49 పరుగులు చేసిన రసెల్.. జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. సొంత మైదానంలో తమకు లభించిన మద్దతును చూసి రసెల్ ఉద్వేగానికి గుర్యయాడట. ఏడుపు ఒకటే తక్కువయిందని చెప్పుకొచ్చాడు షారుక్ ఖాన్.
ఏడాది నిషేధం తర్వాత పునరాగమనం చేసిన వార్నర్ 85 పరుగులతో ఆకట్టుకున్నాడు. బెయిర్ స్ట్రోతో కలిసి 118 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీంతో సన్‌రైజర్స్.. కోల్‌కతా ముందు 182 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.