తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ వేలం ముందుకు రానున్న ఆటగాళ్లు వీరే - ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల జాబితా

ఐపీఎల్-2020 కోసం నిర్వహించనున్న వేలంలో మొత్తం 73 స్థానాలను భర్తీ చేసేందుకు 332 మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు. కోల్​కతా వేదికగా జరగనున్న ఈ వేలంలో అందుబాటులోకి రానున్న ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం.

IPL 2019 Auction Full list of 332 players ranked based on base price
ఐపీఎల్ వేలం ముందుకు రానున్న ఆటగాళ్లు వీరే

By

Published : Dec 18, 2019, 12:41 PM IST

గురువారం ఐపీఎల్ 13 సీజన్​ కోసం వేలం నిర్వహించనున్నారు. కోల్​కతా వేదికగా జరగనున్న ఈ వేలానికి అన్ని ఫ్రాంఛైజీలు ఇప్పటికే సన్నద్దమయ్యాయి. క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు తమ వ్యూహాలకు పదునుపెట్టుకుంటున్నాయి. ఈ వేలానికి మొత్తం 332 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారు. కనీస ధరల వారీగా ఆటగాళ్ల జాబితా ఇప్పుడు చూద్దాం.

కనీసధర రెండు కోట్లు నిర్ణయించిన క్రికెటర్లు..

ఆస్ట్రేలియా నుంచి ప్యాట్ కమిన్స్​, జోష్ హెజిల్​వుడ్, క్రిస్ లిన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్​వెల్ తమ ధరను రూ.2కోట్లుగా నిర్ణయించారు. వీరితో పాటు డేల్ స్టెయిన్(దక్షిణాఫ్రికా), ఆంజెలో మ్యాథ్యూస్(శ్రీలంక) ఈ జాబితాలో ఉన్నారు.

రూ.1.5కోట్లు ధర..

ఇంగ్లాండ్ క్రికెటర్లు ఇయాన్ మోర్గాన్, జేసన్ రాయ్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ తమ ధరను రూ. 1.5కోట్లుగా నిర్ణయించారు. వీరితో పాటు క్రిస్ మోరిస్​(దక్షిణాఫ్రికా), ఆడం జంపా(ఆస్ట్రేలియా), కైల్ అబాట్(దక్షిణాఫ్రికా), కేన్ రిచర్డ్​సన్(ఆస్ట్రేలియా), రాబిన్ ఊతప్ప(భారత్) ఈ జాబితాలో పేరు నమోదు చేశారు.

కనీసధర కోటి నిర్ణయించిన ఆటగాళ్లు..

ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా), మార్టిన్ గప్తిల్(న్యూజిలాండ్), ఎవిన్ లూయిస్(వెస్టిండీస్), కొలిన్ మున్రో(న్యూజిలాండ్), రిలే రొసో(దక్షిణాఫ్రికా), మార్కస్ స్టాయినీస్(ఆస్ట్రేలియా), సామ్ కరన్(ఇంగ్లాండ్), టామ్ కరన్(ఇంగ్లాండ్), మోయిస్ హెన్రిక్స్​(ఆస్ట్రేలియా), తిసారా పెరీరా(శ్రీలంక), షార్ట్(ఆస్ట్రేలియా), ముస్తాఫికర్ రెహమాన్(బంగ్లాదేశ్), కౌల్టర్ నైల్(ఆస్ట్రేలియా), ఆండ్రూ టై(ఆస్ట్రేలియా), టిమ్ సౌథి(న్యూజిలాండ్), జేమ్స్ ప్యాటిన్సన్(ఆస్ట్రేలియా), లియామ్ ప్లంకెట్(ఇంగ్లాండ్), ఆస్తన్ అగర్(ఆస్ట్రేలియా), పీయూష్ చావ్లా(భారత్), యూసఫ్ పఠాన్(భారత్), జయదేవ్ ఉనాద్కత్(భారత్)

రూ. 75లక్షల ధర..

డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా), లెండిల్ సిమన్స్​(వెస్టిండీస్), ముష్ఫీకర్​ రహీమ్​(బంగ్లాదేశ్), అష్తన్ టర్నర్(ఆస్ట్రేలియా), కొనిల్ డి గ్రాండ్​హోమ్​(న్యూజిలాండ్), జేసన్ హోల్డర్(విండీస్), క్రిస్ జోర్డాన్(ఇంగ్లాండ్), మహ్మదుల్లా(బంగ్లాదేశ్), సీన్ అబాట్(ఆస్ట్రేలియా), డేవిడ్ వీస్(దక్షిణాఫ్రికా), డ్యాన్ క్రిస్టియన్(ఆస్ట్రేలియా), మర్చంట్ డిలాంగే(దక్షిణాఫ్రికా), ఇష్ సోధి(న్యూజిలాండ్), సకీబ్ మహ్మద్(ఇంగ్లాండ్).

ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల జాబితా

కనీస ధర రూ. 50లక్షలున్న విదేశీ క్రికెటర్లు కొంతమంది..

అలెక్స్ కేరీ, షాయ్ హోప్, హెన్రిచ్ క్లాసెన్, కుశాల్ పెరీరా, షిమ్రన్ హెట్​మయర్, మార్కరమ్​, జానేమన్ మలన్, కార్లోస్ బ్రాత్​వైట్, జేమ్స్ నీషమ్, కొలిన్ ఇంగ్రామ్, డ్యారిల్ మిచెల్, రోవ్​మన్ పోవెల్, జాన్ స్మట్స్, టామ్ బ్రూస్, దిముత్ కరుణరత్నే, ఒషాడా ఫెర్నాండో తదితరులు కనీస దర రూ. 50లక్షలుగా నిర్ణయించారు.

కనీస ధర రూ. 50లక్షలున్న భారత క్రికెటర్లు..

ఛతేశ్వర్ పుజారా, హనుమ విహారీ, నమన్ ఓజా, సౌరభ్ తివారి, మనోజ్ తివారి, స్టువర్ట్ బిన్ని, రిషి ధావన్, మోహిత్ శర్మ, బరిందర్ శరణ్ ఈ జాబితాలో ఉన్నారు.

50లక్షల కంటే తక్కువ ధర నిర్ణయించిన కొంతమంది..

కేమరూన్ డెల్​పోర్ట్(40లక్షలు), జేమ్స్ ఫుల్లర్(40 లక్షలు), జలజ్ సక్సేనా(30లక్షలు), ప్రియమ్ గర్గ్(20లక్షలు), విరాట్ సింగ్(20లక్షలు), యశస్వి జైస్వాల్(20లక్షలు), ఇషాన్ పోరెల్(20లక్షలు), రికీ భూయ్(20లక్షలు), ధ్రువ్ షోరే(20లక్షలు), బాబా అపరాజిత్(20లక్షలు), అర్మన్ జాఫర్(20లక్షలు), ధర్మేంద్ర సిన్హ జడేజా(20లక్షలు), జార్జ్ మున్సే(20లక్షలు).

ఐపీఎల్ వేలానికి మొత్తం 997 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా.. వేలంలో తుది జాబితా కింద 332 మంది ఎంపికయ్యారు. ఈ సారి 24 మంది కొత్త ఆటగాళ్లు వేలం ముందుకు రానున్నారు. మొత్తం 73 స్థానాలను భర్తీ చేసేందుకు 8 ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి.

ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం: విదేశీ ఫినిషర్​ కోసం దిల్లీ ఫోకస్​..!

ABOUT THE AUTHOR

...view details