తెలంగాణ

telangana

ETV Bharat / sports

వచ్చే ఏడాది ఐపీఎల్​ భారత్​లోనే: గంగూలీ - ganguli comments on ipl 2014

టీమ్​ఇండియా భవిష్యత్​ ప్రణాళికల గురించి మాట్లాడిన బీసీసీఐ అధ్యక్షుడు​ గంగూలీ వచ్చే ఏడాది ఐపీఎల్​పై స్పష్టతనిచ్చాడు. ఎప్పుడు జరగనుందో కూడా చెప్పాడు.

IPL 14
ఐపీఎల్​

By

Published : Aug 22, 2020, 5:09 PM IST

వచ్చే ఏడాది ఐపీఎల్​, భారత్​లోనే జరగనుందని బీసీసీఐ వెల్లడించింది. ఈ క్రమంలోనే టీమ్​ఇండియా భవిష్యత్​ ప్రణాళికలపై బోర్డు అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించారు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత వచ్చే సంవత్సరం​ ఇంగ్లాండ్​కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు రాష్ట్ర క్రికెట్​ సంఘాలకు రాసిన లేఖలో దాదా తెలియజేశాడు. దీని తర్వాత ఏప్రిల్​లో ఐపీఎల్​ను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశాడు. వీటితో పాటే టీ20 ప్రపంచకప్(2021), వన్డే ప్రపంచకప్​లకూ(2023) భారత్ ఆతిథ్యమివ్వనుందని తెలిపాడు.

ఐపీఎెల్​
దేశవాళీ క్రికెట్​

"సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈలో ఐపీఎల్​-2020 జరగనుంది. లీగ్​ సజావుగా సాగేందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత దేశవాళీ క్రికెట్​ను తిరిగి ప్రారంభిస్తాం. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే కరోనా తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నా"

సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​ను యూఏఈలో జరపాల్సి వచ్చింది. మరోవైపు భారత మహిళా సీనియర్ జట్టు పర్యటనలపైనా చర్చలు జరుపుతున్నట్లు గంగూలీ వివరించాడు. త్వరలోనే అన్నింటి గురించి వెల్లడిస్తామని పేర్కొన్నాడు.

భారత్​ Xఇంగ్లాండ్​
భారత్​ ఆస్ట్రేలియా పర్యటన

ABOUT THE AUTHOR

...view details