తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ వేలం: 57 మంది ప్లేయర్లు.. రూ. 145.3 కోట్లు - ఐపీఎల్ వేలం 2021 తాజా అప్​డేట్స్

IPL 14 Auction
ఐపీఎల్

By

Published : Feb 18, 2021, 2:50 PM IST

Updated : Feb 18, 2021, 9:58 PM IST

21:52 February 18

ముగిసిన వేలం..

ఐపీఎల్​-14 మినీ వేలం ముగిసింది. 8 ఫ్రాంఛైజీలు రూ. 145.3 కోట్లు వెచ్చించి.. 57 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందులో 22 మంది విదేశీ ఆటగాళ్లు. 29 మంది అన్​క్యాప్డ్​ ప్లేయర్లు.

యువరాజ్‌ సింగ్‌ అత్యధిక ధర రికార్డును క్రిస్‌ మోరిస్(రూ. 16.25 కోట్లు)‌ బద్దలు కొట్టాడు. కైల్‌ జేమిసన్(రూ. 15 కోట్లు)‌, మ్యాక్స్​వెల్​(రూ. 14.25 కోట్లు), జే రిచర్డ్​సన్​(రూ.14 కోట్లు),  రిలె మెరిడిత్‌(రూ. 8 కోట్లు), షారుక్ ఖాన్‌( రూ. 5.25 కోట్లు) వంటి కుర్రాళ్లు కోట్ల రూపాయలు పలికారు. దేశవాళీ ఆల్‌రౌండర్‌ కృష్ణప్ప గౌతమ్(రూ. 9.25 కోట్లు)‌ భారీ మొత్తం సొంతం చేసుకున్నాడు

20:13 February 18

సచిన్​ తనయుడు ముంబయికే..

భారత క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందుల్కర్​ తనయుడు.. అర్జున్​ తెందుల్కర్​ను రూ. 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది ముంబయి ఇండియన్స్​. ఇతనిపై వేరే ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. 

19:53 February 18

కోల్​కతాకు కటింగ్

ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ బెన్ కటింగ్​ను రూ 75 లక్షలకు దక్కించుకుంది కోల్​కతా నైట్​రైడర్స్.

19:52 February 18

చెన్నైకి నిశాంత్

హరి నిశాంత్​ను 20 లక్షల కనీస ధరకు తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్.

19:51 February 18

కోల్​కతాకు హర్భజన్

హర్భజన్ సింగ్​ను 2 కోట్లకు దక్కించుకుంది కోల్​కతా నైట్​రైడర్స్.

19:50 February 18

హైాదరాబాద్​కు ముజిబుర్

అఫ్ఘానిస్థాన్ ఆల్​రౌండర్ ముజిబుర్ రెహ్మన్​ను 1.5 కోట్లకు కొనుగోలు చేసింది సన్​రైజర్స్ హైదరాబాద్.

19:49 February 18

హైదరాబాద్​కు కేదార్ జాదవ్

టీమ్ఇండియా ఆల్​రౌండర్ కేదార్ జాదవ్​ను రూ 2 కోట్లకు దక్కించుకుంది సన్​రైజర్స్.

19:48 February 18

ముంబయికి జాన్సెన్

దక్షిణాఫ్రికా యువ బౌలింగ్ ఆల్​రౌండర్​ మార్కో జాన్సెన్​ను 20 లక్షలకు కొనుగోలు చేసింది ముంబయి ఇండియన్స్.

19:40 February 18

ముంబయికి నీషమ్

న్యూజిలాండ్ ఆల్​రౌండర్ జిమ్మీ నీషమ్​ను కనీస ధర రూ 50 లక్షలకు కొనుగోలు చేసింది ముంబయి ఇండియన్స్.

19:38 February 18

రాజస్థాన్​కు కుల్దీప్

బౌలర్ కుల్దీప్ యాదవ్​ను కనీస ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.

19:37 February 18

బెంగళూరుకు భరత్,  సుయాస్

తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్​తో పాటు మరో క్రికెటర్ సుయాస్ ప్రభుదేశాయ్​ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కనీస ధర రూ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

19:26 February 18

బెంగళూరుకు క్రిస్టియన్

ఆస్ట్రేలియా సీనియర్ ఆల్​రౌండర్ డేనియల్ క్రిస్టియన్​ను రూ 4.8 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

19:25 February 18

పంజాబ్​కు అలెన్

వెస్టిండీస్ ఆల్​రౌండర్ ఫాబియాన్ అలెన్​ను కనీస ధర రూ 75 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.

19:24 February 18

కోల్​కతాకు వైభవ్

యువ బౌలర్ వైభవ్ అరోరాను కనీస ధర రూ 20 లక్షలకు కొనుగోలు చేసింది కోల్​కతా నైట్​రైడర్స్.

19:23 February 18

పంజాబ్​కు ఉత్కర్ష్

యువ ఆల్​రౌండర్ ఉత్కర్ష్ సింగ్​ను రూ 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.

18:20 February 18

పంజాబ్​కు హెన్రిక్స్​

ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ మోసెస్ హెన్రిక్స్​ను రూ.4.2 కోట్లకు దక్కించుకుంది పంజాబ్ కింగ్స్. 

18:14 February 18

దిల్లీకి టామ్ కరన్

ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ టామ్ కరన్​ను రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది దిల్లీ క్యాపిటల్స్.

18:04 February 18

జేమిసన్ భారీ ధర

న్యూజిలాండ్ బౌలర్ కైల్ జేమిసన్​ భారీ ధర పలికాడు. ఇతడిని 15 కోట్లకు దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

17:59 February 18

చెన్నైకి పుజారా

టీమ్ఇండియా ఆటగాడు పుజారాను 50 లక్షలకు దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్.

17:42 February 18

రాజస్థాన్​కు కరియప్ప

కేసీ కరియప్పను కనీస ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.

17:41 February 18

హైదరాబాద్​కు సుచిత్

యువ బౌలర్ జగదీశ సుచిత్​ను 30 లక్షలకు కొనుగోలు చేసింది సన్​రైజర్స్ హైదరాబాద్.

17:36 February 18

మెరిడిత్​కు భారీ ధర

ఆస్ట్రేలియా యువ బౌలర్ రిలే మెరిడిత్​ను భారీ ధరకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. దిల్లీతో పోటీపడి రూ 8 కోట్లకు ఇతడిని దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన అన్​క్యాప్​డ్ విదేశీ క్రికెటర్​గా నిలిచాడు మెరిడిత్. ఇంతకుముందు ఈ రికార్డు జోఫ్రా ఆర్చర్ (7.2 కోట్లు) పేరిట ఉండేది.

17:29 February 18

రాజస్థాన్​కు చేతన్

యువ బౌలర్ చేతన్ సకరియాకు మంచి ధర దక్కింది. రూ. 1.20 కోట్లకు ఇతడిని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.

17:27 February 18

దిల్లీకి లక్మల్

లక్మల్ మెరివాలాను కనీస ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది దిల్లీ క్యాపిటల్స్.

17:24 February 18

బెంగళూరుకు అజారుద్దీన్

వికెట్ కీపర్ బ్యాట్స్​మన్ మహ్మద్ అజారుద్దీన్​ను కనీస ధర రూ 20 లక్షలకు దక్కించుకుంది రాయల్ ఛాలెెంజర్స్ బెంగళూరు.

17:21 February 18

దిల్లీకి వినోద్

యువ వికెట్ కీపర్ బ్యాట్స్​మెన్ విష్ణు వినోద్​ను కనీస ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది దిల్లీ క్యాపిటల్స్.

17:16 February 18

గౌతమ్​కు జాక్​పాట్

యువ ఆల్​రౌండర్ కృష్ణప్ప గౌతమ్​ జాక్​పాట్ కొట్టాడు. ఇతడు రూ 20 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొనగా.. 9.25 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ చరిత్రలో ఓ అన్​క్యాప్​డ్ ప్లేయర్​కు ఇదే అత్యధిక ధర. ఇంతకుముందు కృనాల్ పాండ్యా (8.8కోట్లు) పేరిట ఈ రికార్డు ఉండేది. 

17:08 February 18

షారుక్ ఖాన్​కు భారీ ధర

యువ ఆల్​రౌండర్ షారుక్ ఖాన్​ భారీ ధర పలికాడు. కనీస ధర 20 లక్షలతో వేలంలో పాల్గొన్న ఈ ఆటగాడిని రూ 5.25 కోట్లకు దక్కించుకుంది పంజాబ్ కింగ్స్.

17:05 February 18

దిల్లీకి రిపల్ పటేల్

యువ బౌలర్ రిపల్ పటేల్​ను కనీస ధర రూ 20 లక్షలకు కొనుగోలు చేసింది దిల్లీ క్యాపిటల్స్.

17:04 February 18

బెంగళూరుకు పటిదార్ 

రజత్ పటిదార్​ను కనీస ధర రూ 20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

17:01 February 18

బెంగళూరుకు సచిన్ బేబీ

యువ ఆటగాడు సచిన్ బేబిని కనీస ధర రూ 20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

16:58 February 18

రాజస్థాన్​కు ముస్తాఫిజుర్

బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్​ను రాజస్థాన్ రాయల్స్ కోటి రూపాయలకు కొనుగోలు చేసింది.

16:50 February 18

ముంబయికి పీయూష్ చావ్లా

టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లాను రూ 2.4 కోట్లకు కొనుగోలు చేసింది ముంబయి ఇండియన్స్.

16:45 February 18

దిల్లీకి ఉమేశ్

టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్​ను కోటి రూపాయలకు కొనుగోలు చేసింది దిల్లీ క్యాపిటల్స్

16:43 February 18

ముంబయికి కౌల్టర్​నీల్

ఆస్ట్రేలియా పేసర్ నాథన్ కౌల్డర్​నీల్​ను 5 కోట్లకు కొనుగోలు చేసింది ముంబయి ఇండియన్స్.

16:33 February 18

రిచర్డ్​సన్​కు భారీ ధర

ఆస్ట్రేలియా యువ పేసర్ జే రిచర్డ్​సన్​ భారీ ధర పలికాడు. ఇతడిని 14 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.

16:25 February 18

ముంబయికి మిల్నే

న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నేను 3.2 కోట్లకు కొనుగోలు చేసింది ముంబయి ఇండియన్స్. 

16:04 February 18

మలన్​ను దక్కించుకున్న పంజాబ్

ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్​మన్ డేవిడ్ మలన్​ను కనీస ధర 1.5 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. ఇతడు ప్రస్తుతం టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంకింగ్​లో ఉండటం గమనార్హం.

15:53 February 18

మోరిస్​కు రికార్డు ధర

దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్​ క్రిస్​ మోరిస్​కు భారీ ధర దక్కింది. ఇతడిని రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర 16.25 కోట్లకు దక్కించుకుంది. ఇంతకుముందు యువరాజ్​ 16 కోట్లే లీగ్​లో అత్యధికం.

15:47 February 18

దూబేను కొనుగోలు చేసిన రాజస్థాన్

టీమ్ఇండియా ఆల్​రౌండర్ శివం దూబేను రూ.4.4 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఇతడి కోసం సన్​రైజర్స్ పోటీపడినా ఫలితం దక్కలేదు. ఇతడి కనీస ధర 50 లక్షలు కాగా సన్​రైజర్స్​తో పోటీపడి 4.4 కోట్లకు దక్కించుకుంది రాజస్థాన్.

15:44 February 18

చెన్నైకి మొయిన్ అలీ

ఇంగ్లాండ్ స్పిన్నర్ మొయిన్ అలీని 7 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఇతడి కనీస ధర రూ.2 కోట్లు కాగా పంజాబ్​తో పోటీపడి 7 కోట్లకు దక్కించుకుంది చెన్నై. 

15:35 February 18

కోల్​కతాకు షకిబుల్

బంగ్లాదేశ్ స్టార్ ఆల్​రౌండర్ షకిబుల్ హసన్​ను 3.2 కోట్లకు కొనుగోలు చేసింది కోల్​కతా నైట్​రైడర్స్.

15:19 February 18

మ్యాక్స్​వెల్​కు మరోసారి భారీ ధర

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్​వెల్​ను రూ.14.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.  

15:14 February 18

దిల్లీకి స్మిత్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్​ను రూ. 2.2 కోట్లకు దక్కించుకుంది దిల్లీ క్యాపిటల్స్.

14:33 February 18

ఫ్రాంచైజీల మిగులు, ఆటగాళ్ల సంఖ్య

ఫ్రాంచైజీల వారిగా వివరాలు

ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్ల లిస్టును సిద్ధం చేసుకున్నాయి. తమ జట్టు కూర్పును మెరుగుపర్చుకునేలా ప్రణాళికలు రచించాయి. మొత్తం 291 మంది ఈ వేలంలో పాల్గొననున్నారు. ఇందులో 164 మంది భారత ఆటగాళ్లు కాగా, 124 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.

Last Updated : Feb 18, 2021, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details