ఐపీఎల్లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. లీగ్ కోసం దుబాయ్ వెళ్లిన బీసీసీఐ వైద్యబృందంలో ఓ వ్యక్తికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని బోర్డు ధ్రువీకరించింది. దీనితోపాటే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలోనూ ఇద్దరికి పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించింది. వారి పేర్లను మాత్రం బహిర్గతపరచలేదు.
"బీసీసీఐ వైద్యబృందంలోని వ్యక్తికి కరోనా వచ్చింది వాస్తవమే. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. తర్వాతి టెస్ట్‌కు కోలుకుంటారని అనుకుంటున్నాం. ఎన్సీఏలో పాజిటివ్ వచ్చిన ఇద్దరిని ఐసోలేషన్‌లో ఉంచాం" -భారత క్రికెట్ బోర్డు