ఐపీఎల్‌కు ముందు జరిగే వేలం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాళ్లను తీసుకుంటుంది? వారి కోసం ఎంత ఖర్చు చేస్తుంది? లీగ్ కోసం వారి ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఏ ఆటగాడు ఎక్కువ ధర పలుకుతాడు? మొదలైన అంశాల గురించి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. 13వ సీజన్ కోసం వేలం ఫిబ్రవరి 18న జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతి సీజన్లో ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లెవరో తెలుసుకుందాం.
ఐపీఎల్ మొదటి సీజన్లో టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ అత్యధిక ధర పలికాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును విజేతగా నిలిపిన ధోనీ సామర్థ్యాల పట్ల ఫ్రాంచైజీలు ఎక్కువ నమ్మకాన్ని ఉంచాయి. దీంతో ఇతడికి భారీ డిమాండ్ లభించింది. ఈ కారణంగా మహీని 9.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అప్పటి నుంచి చెన్నైకే ఆడుతున్న ధోనీ ఈ ఫ్రాంచైజీకి మూడు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు.