సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ మొదలుకానుంది. ఈ క్రమంలో సీఎస్కే యాజమాన్యం.. తమ జట్టులోని భారత క్రికెటర్ల కోసం చెన్నైలో ఆగస్టు 15-20 మధ్య శిక్షణా శిబిరం ఏర్పాటు చేసింది. ఇందులో ధోనీ, హర్భజన్ సింగ్, రైనా, అంబటి రాయుడు తదితరులు పాల్గొనుండగా.. జడేజా మాత్రం రాలేకపోతున్నట్లు వెల్లడించాడు. ఆగస్టు 21న దుబాయ్ వెళ్లే సమయానికి వస్తానని అతడు చెప్పినట్లు ఫ్రాంఛైజీ తెలిపింది.
ఈ క్యాంప్‌కు క్రికెటర్లతో పాటు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ మాత్రమే హాజరు కానున్నాడు. బ్యాటింగ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, సహాయ కోచ్ మైకేల్ హస్సీ, సీఈఓ కాశీ విశ్వనాథన్.. జట్టు దుబాయ్ వెళ్లిన తర్వాత కలుస్తారు.