తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ 2020: ఏం చేద్దాం.. ఎలా చేద్దాం! - ఐపీఎల్ 2020

దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్​ను యూఏఈ వేదికగా నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలు రూపొందించేందుకు నేడు (ఆదివారం) ఐపీఎల్ పాలకమండలి కీలక సమావేశం నిర్వహిస్తోంది.

ఐపీఎల్ 2020: ఏం చేద్దాం.. ఎలా చేద్దాం!
ఐపీఎల్ 2020: ఏం చేద్దాం.. ఎలా చేద్దాం!

By

Published : Aug 2, 2020, 7:04 AM IST

దేశంలో కరోనా విలయం కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబరు ద్వితీయార్ధం నుంచి నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది బీసీసీఐ. దీనిపై పూర్తి స్థాయిలో విధివిధానాలు రూపొందించేందుకు నేడు (ఆదివారం) కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ కూడా పాల్గొంటారు.

ఐపీఎల్ 2020: ఏం చేద్దాం.. ఎలా చేద్దాం!

ఏయే అంశాలపై చర్చ?:

యూఏఈలో సెప్టెంబరు 19న ఐపీఎల్‌-13ను ఆరంభించాలని బీసీసీఐ భావిస్తోంది. పాలకమండలి సమావేశంలో లీగ్‌ పూర్తి షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశముంది. లీగ్‌లో ఎన్ని మ్యాచ్‌లుంటాయి.. ఎన్ని వేదికల్లో నిర్వహిస్తారు.. ఆటగాళ్ల ప్రయాణ, వసతి సంగతేంటి.. కరోనా ముప్పు లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలు ఈ సమావేశంలోనే తేల్చే అవకాశముంది.

ఐపీఎల్ 2020: ఏం చేద్దాం.. ఎలా చేద్దాం!

లీగ్‌ను సురక్షిత వాతావరణంలో నిర్వహించడానికి ఎలాంటి ప్రణాళికల్ని అనుసరించాలనే దానిపై పాలక మండలి విధి విధానాలు ప్రకటించే అవకాశముంది. యూఏఈలో లీగ్‌ను ఏ ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకుగాను లీగ్‌ నిర్వాహక బృందంతో పాటు ఫ్రాంఛైజీ ప్రతినిధులు, ఆటగాళ్లు ఎప్పుడు, ఎలా, ఏం చేయాలో ఈ సమావేశంలో చర్చించి.. అందరికీ మార్గనిర్దేశ సూచికను అందజేయనున్నట్లు సమాచారం.

ఐపీఎల్ 2020: ఏం చేద్దాం.. ఎలా చేద్దాం!

యూఏఈలో లీగ్‌ నిర్వహణకు అయ్యే ఖర్చెంత, ఆదాయం ఎంత వస్తుంది.. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డుకు ఎంత చెల్లించాలన్నది కూడా ఆ సమావేశంలో చర్చకు రావచ్చు. మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించాలని ఎమిరేట్స్‌ బోర్డు భావిస్తుండగా.. దీనిపై ఐపీఎల్‌ పాలకమండలి ఆలోచనేంటో చూడాలి. యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐకి ఇంకా కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించలేదు.

ABOUT THE AUTHOR

...view details