టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడా బృందానికి 'గుడ్‌విల్ అంబాసిడర్'గా ఉండాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీని భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) కోరింది. ఈ మేరకు ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా లేఖ రాశారు.
ఒలింపిక్స్‌లో భారత్ 'గుడ్‌విల్ అంబాసిడర్' దాదా! - టోక్యో ఒలింపిక్స్
ఈ ఏడాది ఒలింపిక్స్‌లో భారత్ బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని కోరారు ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా. ఈ మేరకు లేఖ రాశారు.
"ఒలింపిక్స్‌లో 14-16 క్రీడా విభాగాల్లో 100-200 మంది అథ్లెట్లు పాల్గొంటారని భావిస్తున్నాం. వీరిలో సీనియర్లు, ఒలింపిక్స్ అనుభవం లేని యువకులు ఉన్నారు. కోట్లాది మంది భారతీయులకు మీరు స్ఫూర్తిగా నిలిచారు. పాలకుడిగా యువ ఆటగాళ్లను సానబెడుతున్నారు. భారత బృందానికి మీ మద్దతు ప్రేరణగా నిలుస్తుంది. మా విజ్ఞప్తిని అంగీకరిస్తారని ఆశిస్తున్నాం" -రాజీవ్ మెహతా, భారత ఒలింపిక్ సంఘం కార్యదర్శి
జపాన్‌లోని టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్.. ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగునున్నాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, షూటర్ అభినవ్ బింద్రా, నటుడు సల్మాన్ ఖాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్.. భారత్‌కు గుడ్‌విల్ అంబాసిడర్స్‌గా వ్యవహరించారు.