తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంజమామ్​ భారత్​ అభిమానిని అందుకే కొట్టబోయాడు - ఇంజమామ్​ భారత్​ అభిమానిని అందుకే కొట్టబోయాడు

ఓ మ్యాచ్​లో పాక్​ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్..‌ ఓ భారత అభిమానిని బ్యాట్‌తో ఎందుకు కొట్టబోయాడో తెలిపాడు ఆ జట్టు దిగ్గజ బౌలర్‌ వకార్‌ యూనిస్‌. టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ అజహరుద్దీన్‌ భార్యను ఆ అభిమాని ఏదో అనడం వల్లే అంతలా కోప్పడ్డాడని చెప్పాడు.

pakcricketer
పాక్​ క్రికెటర్​

By

Published : Jul 19, 2020, 7:57 AM IST

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్​ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ఒకానొక సందర్భంలో ఓ భారత అభిమానిని బ్యాట్‌తో కొట్టబోయాడని తెలిపాడు ఆ జట్టు దిగ్గజ బౌలర్‌ వకార్‌ యూనిస్‌. అయితే అజహరుద్దీన్‌ భార్యను ఏదో అనడం వల్లే అలా చేశాడని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన వకార్‌.. ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తూ ఇరు జట్ల మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో వివరించాడు.

భారత్‌-పాక్‌ ఆటగాళ్లు మైదానంలో మాత్రమే పోరాడేవాళ్లని, బయట మాత్రం చాలా స్నేహపూర్వకంగా మెలిగేవారని తెలిపాడు. ఈ క్రమంలోనే 1997 సహారా కప్‌ సందర్భంగా ఓ భారత అభిమాని ఇంజమామ్‌ను రెచ్చగొట్టాడని, దాంతో అతడిని కొట్టబోయాడని వెల్లడించాడు.

"మ్యాచ్‌ మధ్యలో ఇంజమామ్‌ను ఎవరో ఆలూ అంటూ కామెంట్‌ చేశారు. అయినా అది పట్టించుకోలేదు. తర్వాత ఎవరో అజహరుద్దీన్‌ భార్యపై చెడుగా మాట్లాడారు. దాంతో కోపోద్రిక్తుడైన అతను 12వ ఆటగాడిని ఒక బ్యాట్‌ తీసుకురమ్మని చెప్పాడు. ఆ బ్యాట్‌ తీసుకొని మైదానం లోంచి వెళ్లి స్టాండ్స్‌లో కూర్చున్న ఒక వ్యక్తిని పట్టుకొని వచ్చాడు. అలా చేసినందుకు ఇంజమామ్‌ రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొన్నాడు. తర్వాత అది కోర్టు దాకా వెళ్లింది. దాంతో ఇంజమామ్‌ బాధపడి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి అజహరుద్దీన్‌ జోక్యం చేసుకొని ఆ అభిమానితో మాట్లాడాడు. దాంతో అతడు ఆ వివాదం నుంచి బయటపడ్డాడు. భారత్‌, పాక్‌ ఆటగాళ్లు మైదానంలో ఎంత పోరాడినా బయట మాత్రం ఒకరికి ఒకరు అండగా ఉంటారు. ఇరు జట్ల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది."

- వకార్‌, పాక్ దిగ్గజ బౌలర్‌.

ఇటీవల తన సోషల్​మీడియా ఖాతాలు అనేక సార్లు హ్యాక్​ అవ్వడం వల్ల.. వీటికి గుడ్​బై చెప్తునట్లు ప్రకటించాడు వకార్.

ఇది చూడండి : ఇంగ్లాండ్​ క్రికెటర్​ బెన్​ స్టోక్స్​​ అరుదైన ఘనత

ABOUT THE AUTHOR

...view details