తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సచిన్​ అత్యుత్తమ ఇన్నింగ్స్​ అదే'- ఇంజమామ్​ ప్రశంస - సచిన్ 2003 ప్రపంచకప్​ పాక్​తో ఇన్నింగ్​

భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ను ప్రశంసించాడు పాకిస్థాన్​ మాజీ సారథి ఇంజమామ్​ ఉల్​ హక్​. 2003 ప్రపంచకప్​లో తమ జట్టుపై మాస్టర్​ ఆడిన ఇన్నింగ్స్​ అద్భుతమని కొనియాడాడు.

Sachin
సచిన్​

By

Published : Nov 22, 2020, 7:47 PM IST

2003 ప్రపంచకప్‌లో తమ జట్టుపై దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందుల్కర్‌ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌ను పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజమామ్ ఉల్‌ హక్‌ కొనియాడాడు. అంతకుముందు సచిన్‌ను అలా ఎప్పుడూ చూడలేదని, ఆ మ్యాచ్‌లో ప్రత్యేకంగా ఆడాడని కితాబిచ్చాడు. టీమ్​ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌తో వీడియో ఛాట్‌లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2003 మెగాటోర్నీలోని భారత్-పాక్‌ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.

సచిన్​

"సచిన్ ఆటను ఎన్నోసార్లు చూశాను. కానీ ఆ మ్యాచ్‌లో అతడు ఆడిన విధానాన్ని ఎప్పుడూ చూడలేదు. బౌలింగ్‌కు అనుకూలించే పరిస్థితుల్లో మా బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు అమోఘం. ఆ మ్యాచ్‌లో 98 పరుగులు సాధించిన అతడిని షోయబ్‌ అక్తర్‌ ఔట్‌ చేశాడు. అయితే సచిన్‌ ఆడిన ఇన్నింగ్స్‌ల్లో అదే అత్యుత్తమం. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు. మా భీకర పేసర్లను ఎదుర్కొంటూ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు కొట్టిన బౌండరీలు ఇతర బ్యాట్స్‌మైన్‌పై ఉన్న ఒత్తిడిని తొలగించాయి. మా బౌలింగ్‌ విభాగంలో వసీమ్‌ అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, షోయబ్‌ అక్తర్ వంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. పైగా దక్షిణాఫ్రికాలోని సెంచురియన్ వేదికగా ఆ మ్యాచ్ జరిగింది. దీంతో బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై మంచి స్కోరే సాధించామనుకున్నాం. కానీ సచిన్ గొప్పగా ఆడాడు"

-ఇంజమామ్‌, పాకిస్థాన్​ మాజీ సారథి.

2003, ప్రపంచకప్‌లో పాక్‌పై సచిన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 273 పరుగులు చేసింది. అనంతరం సచిన్ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 75 బంతుల్లో 98 పరుగులు బాదాడు. 12 ఫోర్లు ,ఒక సిక్సర్‌ సాధించాడు. షోయబ్‌ అక్తర్‌ వేసిన షార్ట్‌బాల్‌ను సచిన్‌ డీప్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా బాదిన సిక్సర్‌ ప్రపంచకప్‌లో హైలైట్ షాట్‌గా నిలిచింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

సచిన్​

ఇదీ చూడండి : అప్పుడు సచిన్​కు లారా-గేల్ ప్రత్యేక బహుమతి

ABOUT THE AUTHOR

...view details