తెలంగాణ

telangana

By

Published : Oct 4, 2019, 9:00 AM IST

ETV Bharat / sports

క్రికెట్ కోసం అబ్బాయిలా వేషం మార్చి..!

భారత మహిళా క్రికెట్​లో తనదైన రీతిలో రాణిస్తున్న షెఫాలీ వర్మ గురించి ఆసక్తికర విషయం చెప్పాడు ఆమె తండ్రి సంజీవ్. అకాడమీలో చేర్చేందుకు అబ్బాయిలా వేషధారణ చేయించానని అన్నాడు.

భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ

15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగుపెట్టి రికార్డు సృష్టించింది షెఫాలీ వర్మ. మహిళా ఐపీఎల్‌లోనూ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అందరి దృష్టి ఆకర్షించింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికైంది. తన తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగినా తర్వాతి మ్యాచ్‌లో 46 పరుగులతో జట్టును విజేతగా నిలిపింది. అయితే క్రికెట్‌ అకాడమీలో చేరేందుకు షెఫాలీ అబ్బాయిలా తన వేషధారణ మార్చుకుందని ఆమె తండ్రి సంజీవ్‌ అన్నారు.

భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ

"అమ్మాయి అని చెబితే క్రికెట్ అకాడమీలో చేర్పించుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అవకాశం ఇవ్వమని బతిమలాడినా ప్రయోజనం లేకుండా పోయింది. మా ప్రాంతంలో మహిళల క్రికెట్ అకాడమీ లేదు. అందుకే షెఫాలీకి అబ్బాయిలా హెయిర్‌ కట్‌ చేయించి అకాడమీలో చేర్చాను. ఏమైనా జరుగుతుందేమోనని భయపడ్డాను. కానీ ఎవరూ షెఫాలీని అమ్మాయిగా గుర్తుపట్టలేదు. ఎందుకంటే అప్పుడు ఆమె వయసు తొమ్మిది సంవత్సరాలు. క్రికెట్‌లో పురుషులతో మహిళలు పోటీపడటం అంత సులువు కాదు. షెఫాలీ హెల్మెట్‌కు ఎన్నో సార్లు బంతి బలంగా తగిలింది. అయినా తను క్రికెట్‌ను వదల్లేదు" -సంజీవ్, షెఫాలీ తండ్రి

ఆరేళ్ల కిందట సచిన్​ తెందూల్కర్ ఆడిన చివరి రంజీ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అందులో పదేళ్ల షెఫాలీ ఉంది. ఆ రోజును ఎప్పటికీ మరిచిపోలేనని, క్రికెటర్‌గా తన ప్రయాణం అప్పుడే మొదలైందని పేర్కొంది షెఫాలీ.

ఇది చదవండి: అలా తయారైతే నాకు పెళ్లికాదన్నారు: సానియా మీర్జా

ABOUT THE AUTHOR

...view details