అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ఛైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ బుధవారం రాజీనామా చేశారు. మళ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యే వరకు డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న ఇమ్రాన్ ఖ్వాజా తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. 2015 నవంబర్‌లో మనోహర్ ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న శశాంక్ - International Cricket Council Chairman Shashank Manohar
18:02 July 01
ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న శశాంక్
"ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్‌కు మరో రెండేళ్ల కాలపరిమితి ఉండగానే పదవి నుంచి తప్పుకున్నారు. ఐసీసీ బోర్డు సమావేశమై ఆ స్థానంలో ఇంకొకరిని ఎన్నుకునే వరకు డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. "
ఐసీసీ
ఐసీసీ నిబంధనల ప్రకారం ఛైర్మన్‌గా రెండేళ్ల కాలపరిమితితో మూడు దఫాలు బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే మనోహర్‌కు మరో రెండేళ్ల పాటు కొనసాగేందుకు వీలున్నా ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. శశాంక్ చేసిన కృషికి ఐసీసీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఇమ్రాన్ ఖ్వాజా అన్నారు. వృత్తి పరంగా న్యాయవాదిగా పేరుపొందిన మనోహర్ 2008 నుంచి 2011 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.
తదుపరి చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు వచ్చే వారం ఐసీసీ బోర్డు సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.