ఐపీఎల్-13వ సీజన్లో తేలిపోయిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ (105).. గురువారం టీమ్ఇండియాతో ఆడిన తొలి వన్డేలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతడిని ప్రశంసిస్తూ హాస్యభరితమైన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. "స్మిత్ భారతదేశాన్ని చాలా ఇష్టపడతాడు. దయచేసి అతడికి భారత పౌరసత్వంతో సహ ఆధార్‌కార్డును మంజూరు చేయండి" అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
'స్మిత్‌కు భారత పౌరసత్వం ఇవ్వాలి' - smith aadhar cad akash chopra
గురువారం భారత్-ఆసీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో శతకం బాదిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను ప్రశంసించాడు కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. అతడికి భారత పౌరసత్వం, ఆధార్ కార్డ్ మంజూరు చేయాలంటూ హాస్యభరితమైన ట్వీట్ చేశాడు.
!['స్మిత్‌కు భారత పౌరసత్వం ఇవ్వాలి' Smith](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9685740-404-9685740-1606479625989.jpg)
స్మిత్
ఐపీఎల్ 13వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు సారథిగా వ్యవహరించిన స్మిత్.. 12 మ్యాచుల్లో 192 పరుగులు మాత్రమే చేశాడు.
ఇదీ చూడండి : ఈ బ్యాట్స్‌మెన్‌కు ఆ బౌలర్లతో చాలా ఇబ్బందే!