భుజం గాయంతో బాధ పడుతున్న శ్రేయస్ అయ్యర్‌కు ఏప్రిల్ 8న శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. మార్చి 23న పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే సందర్భంగా శ్రేయస్ గాయపడ్డాడు.
జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లిష్ కౌంటీల్లో లాంక్షైర్ తరఫున ఆడనున్నాడు శ్రేయస్. కానీ, సర్జరీ తర్వాత నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంది. దీంతో కౌంటీల్లో నుంచి కూడా అయ్యర్ తప్పుకోనున్నాడు.