దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టెస్టుకు ముందు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ ఆటగాడి స్థానంలో యువ ఆటగాడు షహబాజ్ నదీమ్‌ను జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. మరి చివరి టెస్టులో ఈ నదీమ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో అన్నది అనుమానమే.
కుల్దీప్ స్థానంలో నదీమ్.. తుది జట్టులో ఉంటాడా..!
రాంచీలో రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్ కోసం షహబాజ్ నదీమ్‌ను జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. కుల్దీప్ గాయంతో బాధపడుతుండటం వల్ల అతడి స్థానంలో నదీమ్‌కు అవకాశం కల్పించింది.
ఇటీవల వెస్టిండీస్-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నదీమ్ మంచి ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకు భారత సీనియర్ జట్టు తరఫున ఆడని నదీమ్ శనివారం నుంచి ఆరంభం కానున్న టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేయాలని భావిస్తున్నాడు. రాంచీ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటం వల్ల ఇషాంత్‌ను పక్కకు పెట్టి కుల్దీప్‌కు చోటు కల్పించాలనుకున్నారు. కానీ కుల్దీప్ గాయంతో బాధపడుతుండటం వల్ల నదీమ్‌నే తమ మరో స్పిన్ ఆప్షన్‌గా టీమిండియా మేనేజ్‌మెంట్ ఎంచుకుంది.
ఇవీ చూడండి.. అద్భుతంగా క్యాచ్ పట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్