టీమిండియా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్-రిషబ్ పంత్ జోడీ అరుదైన రికార్డు నెలకొల్పింది. వన్డేల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ద్వయంగా ఘనత సాధించింది.
దిగ్గజాల రికార్డు...
టీమిండియా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్-రిషబ్ పంత్ జోడీ అరుదైన రికార్డు నెలకొల్పింది. వన్డేల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ద్వయంగా ఘనత సాధించింది.
దిగ్గజాల రికార్డు...
1999లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో సచిన్ తెందూల్కర్-అజయ్ జడేజా కలిసి ఒక ఓవర్‌లో 28 పరుగులు సాధించారు. తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేశారు శ్రేయస్ అయ్యర్-రిషబ్ పంత్. విండీస్‌తో రెండో వన్డేలో ఈ ద్వయం.. ఏకంగా 31 పరుగులు సాధించింది. రోస్టన్ ఛేజ్ వేసిన 47 ఓవర్‌లో అయ్యర్-పంత్‌లు ఈ ఫీట్‌ను నమోదు చేశారు. ఈ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ లభించింది. తొలి బంతిని విండీస్ బౌలర్ ఛేజ్ నో బాల్ వేశాడు. ఆ బంతికి బై రూపంలో పరుగు వచ్చింది. ఈ ఓవర్‌లో పంత్ కేవలం ఒక్క పరుగు మాత్రమే తీయగా, 28 పరుగుల్ని అయ్యర్ సాధించాడు.
వన్డేల్లో ఒక ఓవర్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు ఇదే అత్యధిక స్కోరు. మొత్తంగా పంత్, శ్రేయస్ 25 బంతుల్లో 18.25 రన్‌రేట్‌తో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా టీమిండియా.. విండీస్‌కు 388 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించగలిగింది. ఛేదనలో 50 ఓవర్లకు 280 పరుగులకే ఆలౌటైంది విండీస్. ఫలితంగా కోహ్లీసేన 107 పరుగుల తేడాతో గెలిచింది.