ఇంగ్లండ్‌తో తలపడే భారత మహిళా జట్టిదే - india england womens cricket match in wankade stadium
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ గెలిచి ఊపుమీదున్న భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌పైనా అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. స్వదేశంలో భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌తో జరిగే షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. మిథాలీ రాజ్ ఈ సిరీస్‌కూ కెప్టెన్టీ భాద్యతలు చేపట్టనుంది.

వాంఖడే స్టేడియంలో భారత్-ఇంగ్లాడ్ మ్యాచ్
ప్రస్తుత న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న మన జట్టు ఫిబ్రవరి 22 నుంచి ముంబయిలో ఇంగ్లీష్ జట్టుతో మ్యాచ్‌లు ఆడనుంది. ఐసీసీ మహిళా ఛాంపియన్‌షిప్‌లో భాగంగానే ఈ మూడు వన్డేలు స్వదేశంలో జరగనున్నాయి. మ్యాచ్‌లన్నింటికీ ముంబయి వాంఖడే స్టేడియం వేదిక కానుంది. ఇంతకు ముందే న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను 2-1తేడాతో గెలిచి జోరుమీదుంది టీమిండియా. ఈ సిరీస్‌కు ముందు ప్రెసిడెంట్స్ ఎలెవన్స్తో ఇంగ్లండ్ జట్టు ఫిబ్రవరి 18న వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
- భారత మహిళా వన్డే జట్టు: మిథాలీ రాజ్(కెప్టెన్), జులాన్ గోస్వామి, స్మృతి మంధానా, జెమామి రోడ్రిగ్జ్, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, తానియా భాటియా(వికెట్ కీపర్), ఆర్ కల్పన(వికెట్ కీపర్), మోనా మేస్రమ్, ఏక్తా బిస్త్, రాజేశ్వరి గైక్వాడ్, పూనం యాదవ్, శిఖా పాండే, మాన్షి జోషి, పూనమ్ రౌత్.
- బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్: స్మృతి మంధానా(కెప్టెన్), వేదా కృష్ణమూర్తి, దేవికా వైద్యా, ఎస్ మేఘన, భారతి పుల్మలి, కోమల్ జన్జాద్, ఆర్ కల్పన, ప్రియా పూనియా, హర్లిన్ డియోల్, రీమా లక్ష్మి, మనాలి దక్షిణి, మిన్నూ మణి, తనూజ కన్వర్.